జగన్, మంత్రులపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి..!

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎంగా వైఎస్ జగన్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మంత్రుల గురించి ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, జనాలు ఒకింత కంగుతిన్నారట. ఆ షాకింగ్ విషయమేంటో ఇప్పుడు చూద్దాం.

అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక బుధవారం నాడు ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏపీ కేబినెట్‌లో అందరికంటే వైఎస్ జగన్ అత్యంత సంపన్నుడని.. ఆయన సంపద విలువ ఏకంగా రూ.510 కోట్లు అని తేల్చింది. అంతేకాదు.. కేబినెట్‌లోని 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులేనని షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఈ 26 మంది సంపద విలువ సగటున రూ.35.25 కోట్లుగా ఉందట.

ఎవరి స్థానమేది..!?

మొదటి స్థానంలో వైఎస్ జగన్.. సంపద విలువ రూ.510 కోట్లు

రెండో స్ధానంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. సంపద విలువ రూ.130 కోట్లు.

మూడో స్థానంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. సంపద విలువ రూ.61 కోట్లు.

మంత్రివర్గంలోని 26 మంది మంత్రుల్లో ముగ్గురి వార్షిక ఆదాయం రూ.కోటి పైమాటేనట.

35 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ ఓ ప్రకటనలో తేల్చింది.

కాగా.. ఈ ప్రకటనపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుండగా.. కార్యకర్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సైతం వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ టీడీపీ బాగోతాలు సైతం బయటపెడుతున్నారు. అయితే వైసీపీ పెద్దలు, మంత్రులు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

నవ్యాంధ్రలో చంద్రబాబుకు కొత్త ఇళ్లు దొరికిందోచ్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే అమరావతిలోని ఉండవల్లిలో ఉండే ప్రజావేదికను అధికారులు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.

రైతన్నకు జగన్ సర్కార్ శుభవార్త.. టీడీపీకి మరో షాక్!

వైసీపీ అధికారంలోకి వస్తే రైతన్నలకు శుభవార్త చెబుతామని.. ముఖ్యంగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.

పీవీ, ప్రణబ్‌‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నేతల నోరు జారుడు ఎక్కువైంది. మీడియా గొట్టాలు దొరికితే చాలు..

సెంటర్ ఏదైనా ఓకే.. దమ్ముంటే రా.. టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.