Siddaramaiah:సస్పెన్స్‌కు చెక్ : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య... హైమాండ్ బుజ్జగింపులతో దిగొచ్చిన డీకే , డిప్యూటీ సీఎంగా ఓకే

  • IndiaGlitz, [Thursday,May 18 2023]

గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటకలో అఖండ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌కు సీఎంను ఎంపిక చేయడం పెద్ద టాస్క్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో ఒకరిని సీఎంగా ఎంపిక చేయాల్సి రావడం.. ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో హైమాండ్‌కు తలబొప్పి కట్టింది. సుదీర్ఘ మంతనాల నేపథ్యంలో ఎట్టకేలకు డీకే శివకుమార్ మెత్తబడటంతో సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అలాగే రాష్ట్రానికి ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కొనసాగుతారని అధిష్టానం స్పష్టం చేసింది. ఎల్లుండి బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

పెద్దల రాయబారంతో మెత్తబడ్డ డీకే శివకుమార్ :

అయితే సీఎం పదవి తప్పించి తనకు మరేమి అక్కర్లేదని డీకే శివకుమార్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు సహకరించానని, తనపై కేసులు వున్నా బీజేపీతో పోరాడానని డీకే అధిష్టానం ముందు చెప్పారు. అలాగే 2018లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్ధరామయ్య హస్తం వుందంటూ ఆధారాలతో సహా పెద్దల ముందు పెట్టారు శివకుమార్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే.. సిద్ధూ, డీకేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో సీఎం పదవిని రెండున్నరేళ్లు ఒకరు, రెండున్నరేళ్లు మరొకరు పంచుకోవాలని అధిష్టానం చెప్పగా.. దీనికి ముందు తానంటే తానంటూ వీరిద్దరూ పట్టుబట్టినట్లుగా సమాచారం. ఎట్టకేలకు తొలుత సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు డీకే అంగీకరించినట్లుగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఆ తర్వాత రెండున్నరేళ్లు శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సిద్ధరామయ్య వైపే సర్వేలన్నీ :

ఇప్పటికే సీఎంగా చేసిన అనుభవంతో పాటు ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వైపు మెజార్టీ శాతం మంది ప్రజలు మొగ్గుచూపారు . గతంలో 2013లో సీఎంగా ఐదేళ్ల పాటు పార్టీని నడిపారు. బీసీ నేత కావడం మరో అదనపు బలం. అయితే సీఎంగా వున్నప్పుడు సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టడం.. వక్కలిగ, లింగాయత్ వర్గాలను పట్టించుకోకపోవడం వంటివి ఆయనకు మైనస్‌గా మారాయి.

బీజేపీకి ఎదురొడ్డి నిలిచిన డీకే శివకుమార్ :

ఇక డీకే శివకుమార్ విషయానికి వస్తే.. వరుసగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతం. అంతేకాకుండా కాంగ్రెస్‌ను కష్టకాలంలో ఆదుకోవడంలో ముందుండటం, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరుంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో శివకుమార్ ఒకరు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన , రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ వేత్తగా నిలిచారు. గడ్డు పరిస్థితుల్లో పీసీసీ బాధ్యతలు చేపట్టిన శివకుమార్.. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరిగినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. 104 రోజుల పాటు తీహార్ జైల్లో వున్నారు.

More News

Kiren Rijiju;న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తప్పించిన మోడీ.. కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు

ఎన్నికల ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజు నుంచి తప్పించారు.

TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్ : తిరుమలలో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లకు షెడ్యూల్ విడుదల.. ఇకపై ప్రతినెలా ఆ తేదీల్లోనే

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Aishwarya Rajesh:వల్లి పాత్రపై వ్యాఖ్యలు .. రష్మిక అద్భుత నటి, నా మాటలకు పెడర్ధాలు తీయొద్దు  : ఇచ్చిపడేసిన ఐశ్వర్యా రాజేశ్

హీరోయిన్ అంటే అందాల ఆరబోతకే పరిమితం అనే మాటను చెరిపేసిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు.

Colors Swathi:అన్నీ ఆ పాత్రలే వచ్చేవి.. ఆ సినిమా టైంలో నాపై రూమర్స్ : కలర్స్ స్వాతి హాట్ కామెంట్స్

టాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడు చూసినా నార్త్, కర్ణాటక, కేరళ అమ్మాయిలే తెలుగు తెరపై హీరోయిన్లు.

OG:క్రేజీ అప్‌డేట్ : పవన్ - సుజిత్ 'ఓజీ' రిలీజ్ టైం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగే

ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ, సాయితేజ్‌తో చేస్తున్న మల్టీస్టార్ సినిమాలు వున్నాయి.