ఇదో సిల్లీ కేసు.. టీవీ9 వివాదం పై శివాజీ ఫస్ట్ టైం స్పందన 

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

టీవీ9 చానల్ యాజమాన్యంతో వివాదాల నేపథ్యంలో మాజీ సీఈవో రవిప్రకాష్, టాలీవుడ్ నటుడు, గరుడ పురాణం శివాజీ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వివాదంలో మూడు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మరోవైపు వరుస నోటీసులు.. తాజాగా లుక్‌ అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో.. ఈ నోటీసులు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్న మాట. ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన గరుడ పురాణం శివాజీ ఫస్ట్ టైం స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.

ఇదో సిల్లీ కేసు..!

నాపై పెట్టింది పెద్ద కేసేమీ కాదని.. ఇంత చిన్న కేసు.. సిల్లీ కేసు.. నేను విదేశాలకు పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. పదేళ్లుగా రవిప్రకాశ్‌తో ఉన్న స్నేహాన్ని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఒప్పందాన్ని కోర్టులో పరిష్కరించుకుందామని ప్రయత్నిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో, మరెక్కడో రిసార్టుల్లో తలదాచుకున్నారని 10టీవీ, సాక్షి టీవీ, రామేశ్వర్ రావు గారి చానళ్లలో తోచిన విధంగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర డబ్బులుంటే మీడియాతో మీరు ఏమైనా చేసుకోండి. అది మీ ఇష్టం.

కానీ, ఓ వ్యక్తిని టార్గెట్ చేసి తొక్కేయాలని ప్రయత్నించడం కుదరనిపని. అయినా ఏంటి మీరు తొక్కేది? నెహ్రూ గారు తన జీవితంలో దాదాపు 9 ఏళ్లపాటు జైల్లోనే ఉన్నారు. నేనిప్పుడు జైలుకు వెళితే పోలీసులేమైనా మర్డర్ చేస్తారా? జై ఆంధ్రా ఉద్యమంలో ఎంతమంది జైలుకు వెళ్లలేదు? ఇప్పుడు మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇది నాకు, రవిప్రకాశ్‌కు మధ్య ఉన్న వ్యవహారం. పైగా కోర్టులో ఉంది. ఇద్దరం స్నేహపూర్వక వాతావరణంలో చేసుకున్న ఒప్పందం అది. ఇదో సిల్లీ కేసు అని శివాజీ చెప్పుకొచ్చాడు.

శునకానందమా..!?

ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓ కొండ. ఇలాంటి రాళ్లకు భయపడను. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చూసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు నేను సిద్ధం అంటూ గరుడ పురాణం శివాజీ చెప్పుకొచ్చాడు.

అన్ని చెప్పిన గరుడ పురాణం శివాజీ పోలీసుల నోటీసుల గురించి మాత్రం స్పందించడం కానీ.. పీఎస్‌కు వచ్చి హాజరవుతానని కానీ చెప్పకపోవడం గమనార్హం. బహుశా గరుడ పురాణం మాదిరిగా ఇవన్నీ ముందే తెలిసుంటే చేయాల్సిన పనులన్నీ చేసేసేవాడేమో అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సో.. ఇప్పటికే అటు రవిప్రకాష్, శివాజీ ఈమెయిల్స్ గుట్టురట్టు చేసిన పోలీసులు వారిద్దరూ ఎక్కడున్నారు..? ఈ మెయిల్స్ ఎక్కడ్నుంచి పంపారు..? ఐపీ అడ్రస్‌లు అన్ని పట్టేసిన పోలీసులు త్వరలోనే వారిద్దర్నీ అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. సో.. మున్ముంథు పరిస్థితి ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

మ‌రోసారి మ‌హేష్ సినిమా పై స‌ల్మాన్ ఆస‌క్తి...

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' రీమేక్‌లో నటించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. స‌ల్మాన్‌ఖాన్

కృష్ణ‌గారి అబ్బాయి కాస్త రెడ్డిగారి అబ్బాయి అవుతున్నారా?

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 'మ‌హ‌ర్షి'తో 25 సినిమాల‌ను పూర్తి చేసుకుంటున్నాడు. 26వ సినిమాగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

కాంచ‌న రీమేక్ 'ల‌క్ష్మీ బాంబ్' ఫ‌స్ట్ లుక్‌

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌ను న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కాంచ‌న' సినిమాని హిందీలో 'ల‌క్ష్మీబాంబ్‌'గా రీమేక్ చేస్తున్నాడు.

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

ఆర్  కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్ , కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ

పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం 'ఉప్పెన‌' లో క్రితి శెట్టి

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి