close
Choose your channels

బాలయ్యతో సినిమాపై తేల్చేసిన సోనాక్షి సిన్హా...

Monday, December 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్యతో సినిమాపై తేల్చేసిన సోనాక్షి సిన్హా...

నంద‌మూరి బాల‌కృష్ణ- బోయపాటి కాంబోలో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఇది 106వ సినిమా కావడంతో కాసింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు..? అనే విషయం తెలియరాలేదు కానీ.. పుకార్లు మాత్రం బోలెడన్ని వచ్చాయ్. ఇదిగో ఈ బ్యూటీని తీసుకుంటున్నారు.. అదుగో ఆ బాలీవుడ్ భామను తీసుకుంటున్నారు.. అబ్బే తెలుగు హీరోయిన్‌నే తీసుకుంటున్నారు అని ఇలా చాలానే పుకార్లు వచ్చాయి. అయితే.. ఫైనల్‌గా ఈ హీరోయిన్‌ల ఎంపిక బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దగ్గర వచ్చి ఆగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది.. కొత్త సంవత్సరంలో సినిమాను పట్టాలెక్కించేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయ్.

అయితే.. ఈ పుకార్లు షికార్లు చేస్తూ.. సోనాక్షి చెవిన పడటంతో బాలయ్య సరసన నటించే విషయమై తేల్చేసింది. బాలకృష్ణ సరసన తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని.. ఎవరూ నమ్మకండి అని ఆమె త్చేసింది. అంతేకాదు.. తాను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నానని.. తన తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని సింగిల్ మాటతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. మొత్తానికి చూస్తే బాలీవుడ్ నుంచి ఇక బ్యూటీలను తీసుకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి తెలుస్తోంది.

అయితే.. నిన్నట్నుంచి అబ్బే సోనాక్షి కాదు.. యంగ్ ఎమ్మెల్యేగా నటించి మెప్పించిన కేథరిన్‌ థ్రెసాను తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వినవచ్చాయి. ఇప్పటివరకూ ఈ బ్యూటీ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి మరి. కాగా.. సింహా, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.