బాలయ్యతో మరోసారి చేస్తుంది...

  • IndiaGlitz, [Thursday,July 02 2015]

సింహా', లెజెండ్‌', లయన్‌' వంటి వరుస విజయాలను సాధించిన బాక్సాఫీస్‌ బొనాంజా నటసింహ నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్‌'లో నటించడానికి సిద్ధమవుతున్నారు. లక్ష్యం', రామ రామ కృష్ణ కృష్ణ', పాండవులు పాండవులు తుమ్మెద', లౌక్యం' వంటి కమర్షియల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌తో అలరించిన వెర్సటైల్‌ డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇండియాలో టాప్‌మోస్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌గా పేరొందిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని బాలయ్య ఇప్పటివరకు చేసిన చిత్రాలకంటే స్టైలిష్‌గా, రిచ్‌గా ఉండేలా డైరెక్టర్‌ శ్రీవాస్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్‌ శ్రీవాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మకడలి, సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె. నాయుడు యూరోప్‌ వెళ్లి షూటింగ్‌ లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు. ఇప్పటివరకు ఏ చిత్రమూ షూటింగ్‌ చేయనటువంటి లొకేషన్స్‌లో ఈ సినిమా సాంగ్స్‌, టాకీ, యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరించడానికి దర్శకుడు శ్రీవాస్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లెజెండ్‌'వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీతో సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్‌చౌహాన్‌ కూడా బాలయ్య సరసన మరో హీరోయిన్‌గా ఎంపికైంది. శ్రీవాస్‌ దర్శకత్వంలోపాటు ప్రొడక్షన్‌ బాధ్యతలు కూడా నిర్వహిస్తుండడంతో సినిమా పట్ల చాలా కేర్‌ తీసుకుని సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా, గ్రాండ్‌లెవల్‌లో రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

Mohanlal's push-up with Pranav on top

Mohanlal's body fitness and flexibility is something that belies his age and appearance. Malayalees have been witness to this time and again in many of the movies he has done thus far. His latest release 'Lailaa O Lailaa' also had some good stunts by the star......

'Loham' is not about gold smuggling

'Loham' starring Mohanlal in the lead and directed by Ranjith is gearing up for an Onam release. It was widely reported that 'Loham' is based on gold smuggling from the gulf to Kerala. Though it is true thematically,.......

Famous young Tamil actor heads for divorce

Actor Kreshna’s professional life is all bright with a super hit in ‘Yaamirukka Bayame’ and an average grosser ‘Vanavarayan Vallavarayan’. Currently he is acting in ‘Yatchan’ which is his first film with his brother director Vishnuvardhan. This film is expected to make more wonders to his acting career.......

Madhavan speaks about the three year gap in his acting career

Actor Madhavan’s last film in Tamil was ‘Vettai’ directed by Lingusamy that released in early 2012. Despite that film being an average grosser Madhavan did not appear in any other film in Kollywood...

Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine

Shruti Haasan featured on the cover of FHM India Magazine and she looks very beautiful on it. On the work front, Shruti Haasan is currently shooting for Mahesh Babu's 'Srimanthudu',