బాబుకు షాక్.. కేసీఆర్, జగన్‌కు సోనియా లేఖ!?

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

టీడీపీ అధినేత చంద్రబాబుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కోలుకోలేని షాకిచ్చారు..? చంద్రబాబును కాదనుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోనియమ్మ టచ్‌లోకి వచ్చారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు చంద్రబాబును సోనియా ఎందుకు వద్దనుకున్నారు..? బాబును ఎందుకు దూరం పెడుతున్నారు..? వైఎస్ జగన్‌, కేసీఆర్‌కు ఆమె ఎందుకు టచ్‌లోకి వచ్చారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ప్రాంతీయ పార్టీలకు సోనియా లేఖ!

2014లో చేజేతులారా ప్రధాని పీఠాన్ని ఎన్డీఏకు కట్టబెట్టిన యూపీఏ ఈసారి ఎలాగైనా సరే పీఠమెక్కి తీరాల్సిందేనని భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సోనియమ్మ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ఈసారి ఎన్డీఏకు చెక్ పెట్టి తీరాల్సిందేనని అన్ని పార్టీలను కలుపునికి వెళ్లేందుకు ముందడుగు వేసున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు సోనియా లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి మే 23వ తేదీన నిర్వహిస్తున్న సమావేశానికి సోనియా ఆ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

బాబుకు షాక్.. కేసీఆర్‌, జగన్‌కు ఆహ్వానం..!

కాగా.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కేసీఆర్, వైఎస్ జగన్‌కు కూడా సోనియా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో స్వయంగా మాట్లాడి 23వ తేదీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ 23వ తేదీ సమావేశానికి హాజరు కావడమనేది ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉందన్న మాట. కాగా.. ఇప్పటి వరకూ చంద్రబాబు అన్నీ తానై ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ.. సోనియా.. కేసీఆర్‌, జగన్‌కు ఆహ్వానం పంపడంతో బాబుకు షాకిచ్చినట్లైంది. మరోవైపు... చంద్రబాబుకు ఏపీ ఫలితాలు ప్రతికూల పరిస్థితులున్నాయని అందుకే జగన్‌, కేసీఆర్‌కు ఆహ్వానం పంపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కమల్‌కు కీలక బాధ్యతలు..

సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీ రాకుంటే బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. నాన్‌ బీజేపీ అలయన్స్‌ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు మధ్యప్రదేశ్‌ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌‌నాధ్‌కు సోనియా బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఫలితాలు వెల్లడైన అనంతరం హంగ్‌ పార్లమెంట్‌ అనివార్యమైతే చిన్న, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే కసరత్తు చేసేందుకు కమల్‌‌కు బాధ్యతలు అప్పగించిందన్న మాట. సో.. ఇప్పటి వరకూ జరిగిన పోలింగ్ వ్యవహారాలను బట్టి చూస్తే.. హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

More News

‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగేది ఇక్కడే...

‘రైతుకు కావాల్సింది జాలి కాదు.. మ‌ర్యాద‌.. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌న అంద‌రిదీ’ అనే పాయింట్‌ ఆధారంగా మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మ‌హ‌ర్షి'.

ఏపీలో ఐదు చోట్ల మళ్లీ పోలింగ్..

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పిన టీవీ9 రవిప్రకాష్!

టీవీ9 వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవోగా సుమారు 15 ఏళ్లు పాటు మీడియా ఇండస్ట్రీలో సేవలందించిన వ్యక్తి రవిప్రకాష్. టీవీ9 అంటే రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9 అనేంతగా ఇప్పటి వరకూ పరిస్థితులుండేవి.

గోదావరి వాసుల గుండెల్లో ఉన్నావ్ కాటన్ దొర!

అన్నం పెట్టే రైతన్నకు సాగునీరు అందక అల్లాడుతున్న కాలంలో ధాన్యం పండించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆనకట్టకు రూపకల్పన చేసిన మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన దొర.

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ 

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన '' 86 వసంతాల తెలుగు సినిమా ''