పాక్‌‌కు వత్తాసు పలికినందుకు సిద్ధూకు షాకిచ్చిన ‘సోనీ’...

  • IndiaGlitz, [Sunday,February 17 2019]

పుల్వామాలో జరిగిన ఉగ్రమూకల దాడిలో 40మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించి పాక్‌‌పై కన్నెర్రజేసింది. అయితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం పాక్‌‌కు వత్తాసు పలుకుతూ మాట్లాడారు. ఆయనెవరో కాదు.. మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పుల్వామాలో జరిగిన ఖండిస్తూనే.. ఉగ్రవాదానికి జాతి మతం, కులం ఉండదని.. ఏ ఒక్కరో చేసిన పనికి మొత్తం దేశానికి ఆపాదించి నిందించడం సబబుకాదుఅని పాక్‌‌ను వెనకేసుకొచ్చారు. దీంతో నెటిజన్లు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అన్నీ తెలిసిన ఈయన ఎందుకిలా అన్నారో.. ఏంటో అర్థంగాక అభిమానులు, కార్యకర్తలు సైతం జుట్టుపీక్కున్నారు. సిద్ధూను.. తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్‌‌ కూడా గట్టిగానే తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంది. ముఖ్యంగా పాక్‌‌ను వెనకేసుకొస్తున్నోడివి అక్కడికెళ్లి బతకాలిగానీ ఇక్కడెందుకున్నావ్ అంటూ నెటిజన్లు, ఇండియన్స్ కన్నెర్రజేశారు. మరికొందరైతే సిద్ధూపై బూతుల వర్షం కురిపించారు.

మూల్యం చెల్లించుకున్న సిద్ధూ..

ఇక విషయానికొస్తే.. సిద్ధూ మాట్టాడిన మాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పలేదు. ఆయన మంత్రిగానే కాదు.. సోనీ టీవీలో ప్రసారమయ్యే.. ‘కపిల్ శర్మ’ కామెడీ షో లో ఒక సభ్యుడన్న విషయం విదితమే. అయితే దేశం మొత్తం ఆయనపై ట్రోల్స్ వస్తుండటం, సోనీటీవీకి దేశభక్తి ఉంటే ఆయన్ను షో నుంచి బహిష్కరించాలంటూ నెట్టింట్లో ఇండియన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో సిద్ధూను షోలో కొనసాగించడం ఏ మాత్రం పద్ధతి కాదని భావించిన సోనీ టీవీ యాజమాన్యం.. ఇక మీరు దయచేయొచ్చు.. ప్రస్తుతానికి మీ సేవలు చాలు అని స్పష్టం చేసింది. దీంతో ‘కపిల్ శర్మ’ షోకు కొద్దిరోజుల పాటు సిద్ధూ వెళ్లనక్కర్లేదన్న మాట. అయితే ఇంత జరిగినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్స్ ఆగలేదు. అయితే సిద్ధూ స్థానంలో అర్చనను తీసుకున్నట్లు సదరు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమెతో పలు ఎపిసోడ్లు చిత్రీకరించినట్లుగా సమాచారం.

కాగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్-సిద్ధూ ఇద్దరూ ప్రాణ స్నేహితులన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వీళ్లిద్దరూ కలిసి క్రికెట్ ఆడారు. అప్పట్నుంచి వీరిద్దరి దేశాలు వేరైనా స్నేహం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పాక్ ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్‌‌.. ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి మిత్రుడైన సిద్ధూను ఆహ్వానించడం.. ఆయన వెళ్లొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే.

More News

'మౌన‌మే ఇష్టం' టీజ‌ర్ విడుద‌ల‌

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మౌన‌మే ఇష్టం`.

రైతన్నలు చంద్రన్న వైపా.. జగనన్న వైపా..!?

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు హద్దు అదుపు లేకుండా హామీలు ఇచ్చేస్తున్నాయి.

నేను ఎవ్వరికీ భయపడను..లోకేష్‌ ఆయనతో జాగ్రత్త!

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత స్పీడ్ పెంచారు.

జనసేనలో ఈ ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఫిక్స్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన కూడా స్పీడ్‌ పెంచింది.

వీర జవాన్ల కుటుంబాలకు కొండంత అండగా ప్రముఖులు

పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది.