close
Choose your channels

ఒక‌రోజు ముందుగానే స్పైడర్ మ్యాన్

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` సిద్ధ‌మ‌వుతోంది.

`స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం` చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీశ్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది.

ఈ సంద‌ర్భంగా...

సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ .. ``సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం`పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.