శ్రీకాంత్ 'కోతల రాయుడు' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,July 09 2018]

వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది. అలాగే నటాషా దోషి బాలకృష్ణ 'జై సింహ' సినిమాలో నటించింది.

కథ నచ్చడంతో శ్రీకాంత్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గతంలో సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు.

ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

More News

తేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం ప్రారంభం!

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానకరామ్ గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది.

తాత‌య్య‌గా నాగార్జున‌...

అదేంటి నాగార్జున తాత‌య్య అయ్యాడా? అని అనుకునేరు.. ఫోటోలో క‌న‌ప‌డుతున్న‌ది గెట‌ప్ మాత్ర‌మే. వివ‌రాల్లోకెళ్తే.. తాత గెట‌ప్‌లో నాగార్జున ఓ పాప‌తో తీసుకున్న ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మెగా హీరోకి షాకిచ్చిన నిర్మాత‌..?

స‌క్సెస్ లేక‌పోతే ఎవ‌రినీ ప‌ట్టించుకోరు. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో.. రీసెంట్‌గా విడుద‌లైన తేజ్ ఐ ల‌వ్ యుతో డ‌బుల్ హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్

బాల‌య్య‌తో బ్యూటీతో అఖిల్‌?

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు తెలుగు సినిమా పెట్టింది పేరు. ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్.. స్పెష‌ల్ సాంగ్స్‌ ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటాయి.

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు  సమర్పిస్తున్నారు.