close
Choose your channels

శ్రీకాంత్ 'కోతల రాయుడు' ప్రారంభం

Monday, July 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీకాంత్ కోతల రాయుడు ప్రారంభం

వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది. అలాగే నటాషా దోషి బాలకృష్ణ 'జై సింహ' సినిమాలో నటించింది.

కథ నచ్చడంతో శ్రీకాంత్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గతంలో సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీకాంత్ కోతల రాయుడు ప్రారంభం

ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

శ్రీకాంత్ కోతల రాయుడు ప్రారంభం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.