ప్రేమికుల‌కు.. థ‌మ‌న్ గిఫ్ట్‌

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

ప్రేమికుల‌కు యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఓ మంచి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడంట‌. అయితే.. ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ నుంచి ఎవ‌రైనా ఎలాంటి కానుక‌ని ఆశిస్తారో.. అలాంటి గిఫ్ట్‌నే త‌ను ఇవ్వ‌బోతున్నాడు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం థ‌మ‌న్ ఓ ప్రేమ‌క‌థా చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. ఇందులో ఫిదా తో తొలి హిట్ కొట్టిన వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. ఇటీవ‌లే జై ల‌వ కుశ‌తో సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. 40 రోజుల పాటు లండ‌న్‌లో భారీ షెడ్యూల్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇటీవ‌లే ఇండియాకొచ్చేసింది. ఇదిలా ఉంటే.. ప‌ర్‌ఫెక్ట్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా కోసం ప‌ర్‌ఫెక్ట్ ఆల్బ‌మ్ త‌యారైంద‌ని.. ప్రేమికుల కానుక‌గా రానున్న ఈ సినిమాలోని పాట‌లు ల‌వ‌ర్స్‌ని ఉర్రూత‌లూగిస్తాయ‌ని థ‌మ‌న్ ఊరిస్తున్నాడు. అంటే.. థ‌మ‌న్ నుంచి ఓ మంచి ల‌వ్ ఆల్బ‌మ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. తొలిప్రేమ అనే టైటిల్ ఈ సినిమాకి ప‌రిశీల‌న‌లో ఉంది.

More News

కొత్త పార్టీ పెట్టిన సూపర్ స్టార్

ప్రస్తుతం బిగ్ స్టార్ల చూపు రాజకీయాల వైపు మళ్లుతోంది. మొన్న మెగాస్టార్, నిన్న పవర్ స్టార్.. పొలిటికల్ పార్టీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ లు ఆ దిశగా కదులుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి సురేష్‌కొండేటికి ఉన్న అనుబంధం

సురేష్ కొండేటి హైద‌రాబాద్‌కు చ‌ల‌న‌చిత్ర రంగానికి వ‌చ్చిన‌ప్ప‌టినుండి మెగాస్టార్ చిరంజీవి ప్రోత్స‌హిస్తూ వస్తున్నారు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు. సురేష్ ప‌ట్ల చిరంజీవికి ఏదో అభిమానం. ఇక సురేష్ కొండేటికి చిరంజీవి గారంటే వీరాభిమానం. అది హ‌ద్దుల్లేని అభిమానం!

'47 డేస్' మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా "47 డేస్"..  "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

సంక్రాంతి బ‌రిలోకి సూర్య‌...

తెలుగు, త‌మిళ సినిమా మార్కెట్‌లో  త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య‌. ఈ హీరో ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'తానా సెంద కూట్ట‌మ్‌' అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

'2.0' గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ '2.0'.