కీలక పాత్రలో సుహాసిని

  • IndiaGlitz, [Saturday,August 07 2021]

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేష‌నల్ రోల్‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిన మ‌ణిర‌త్నం న‌టిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర‌ర్‌, ధైర్య‌, సాహ‌స‌వంతమైన సింగిల్ మ‌ద‌ర్ ‘సుహా’ పాత్ర‌లో ఈమె క‌నిపిస్తున్నారు. శుక్ర‌వారం సుహాసిని పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

రీసెంట్‌గా ..కుటుంబం, స‌భ్యుల మ‌ధ్య ఉండే ల‌వ్ అండ్ ఎమోష‌న్స్‌తో పాటు భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని తెలిసేలా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది.

సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫ‌ర్.

న‌టీన‌టులు: సుమంత్‌, నైనా గంగూలి, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి త‌దిత‌రులు

More News

నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ ఫ్రైడే స్పెష‌ల్‌..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్ననాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’.

'మ‌హా స‌ముద్రం' నుంచి 'హే రంభ‌...' సాంగ్ రిలీజ్‌

ఓ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మ‌నేది అరుదుగా జ‌రిగే విష‌యం.

ఒలంపిక్ మెడల్ తో హాకీకి పునర్వైభవం: పవన్ కళ్యాణ్

భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో పతకం సాధించి జాతీయ జెండా రెపరెపలాడేలా చేసింది.

రాజీ కుదరడంతో నిహారిక భర్త కేసు సుఖాంతం!

మెగా డాటర్ నిహారిక భర్త ఊహించని విధంగా వార్తల్లో నిలిచాడు.

'యమదొంగ'లా సన్నగా అయిపోతాడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.