close
Choose your channels

రాజీ కుదరడంతో నిహారిక భర్త కేసు సుఖాంతం!

Thursday, August 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా డాటర్ నిహారిక భర్త ఊహించని విధంగా వార్తల్లో నిలిచాడు. నిహారిక భర్తపై వారు నవ్వడం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు పోలీస్ కంప్లైంట్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిహారిక భర్త చైతన్య కూడా వారిపై కేసు పెట్టాడు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తంగా ఈ సమస్యని పోలీసులు శాంతియుతంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది.

బంజారాహిల్స్ లో నిహారిక, చైతన్య ఓ లగ్జరీ ఫ్లాట్ ని తీసుకున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ లో ఆఫీస్ పెట్టడానికి వీల్లేదని అందులో నివాసం ఉంటున్న వారు చైతన్యతో గొడవకు దిగారు. ఇలా చైతన్య, అపార్ట్మెంట్ వాసుల మధ్య వివాదం ముదిరింది. దీనితో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకునేవరకు వ్యవహారం వెళ్ళింది.

అక్రమంగా తన ఆఫీస్ లోకి ప్రవేశించి గొడవచేస్తున్నారని చైతన్య పోలీసులకు తెలిపాడు. అయితే చైతన్య తరచుగా తన ఫ్రెండ్స్ ని తీసుకువచ్చి మద్యం సేవిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు కంప్లైంట్ చేశారు.

మంగళవారం ఈ సంఘటన జరిగింది. బుధవారం ఈ వ్యవహారం పోలిసుల వద్దకు వెళ్ళింది. పోలీసులు అపార్ట్మెంట్ సీసీ టివి ఫుటేజ్ పరిశీలించారు. ఇరువర్గాలని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. దీనితో కేసు సుఖాంతం అయింది.

నిహారిక భర్త కేసులో చిక్కుకున్నాడనే వార్త రావడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక, చైతన్య గత ఏడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.