సుజాత హౌస్ నుంచి అవుట్.. రివెంజ్ తీర్చుకున్న స్టాఫ్..

  • IndiaGlitz, [Monday,October 12 2020]

సండే.. ఫన్‌డే.. రివెంజ్‌లతో పాటు ఎలిమినేషన్.. అంతా మంచి జోష్‌తో నడిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. రాగానే ఫన్ డే సండే‌ని స్టార్ట్ చేశారు. దమ్ షరాత్.. చిట్టీ తీసి దానిలో ఉన్న సినిమా పేరును యాక్ట్ చేసి చూపించాలి. గేమ్‌ను అఖిల్ స్టార్ట్ చేశాడు. ‘ఊహలు గుసగుసలాడే..’ సినిమా వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను సుజాతకు ఇచ్చారు. పోస్టర్‌లో కూడా సుజాతే కనిపించింది. నెక్ట్స్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వచ్చింది. టైటిల్ ఈ హౌస్‌లో ఎవరికి సూట్ అవుతుందని అడగ్గా.. అభిజిత్ అని చెప్పారు. పోస్టర్‌లో కూడా అభిజితే ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. అభి కోసం నాగ్ ఒక డ్యూయెట్ సాంగ్ వేశారు. ఆ సాంగ్‌ను ఎవరితో చేస్తావంటే అభి.. అరియానాను ఎంచుకున్నాడు. దీంతో అరియానా చాలా ఎగ్జైట్ అయింది. నీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పాలని.. అందరినీ లేవమన్నారు. అభి కాస్త కంగారు పడగానే హ్యాపీ బర్త్ డే చెప్పారు. తర్వాత రేసుగుర్రం టైటిల్‌ను మెహబూబ్‌కి ఇచ్చారు.

నెక్ట్స్ సుజాతకు ‘మాస్టర్’ సినిమా వచ్చింది. అమ్మ రాజశేఖర్‌కు మాస్టర్ టైటిల్‌ను ఇచ్చారు. మోనాల్‌కు ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వచ్చింది. ఈ సినిమాను అమ్మ రాజశేఖర్ చెప్పాలి. చివరకు కష్టపడి ఎలాగే చెప్పారు. నోయెల్ అందరికీ హగ్ ఇచ్చి స్టార్ట్ చేస్తాడని కాబట్టి ఆ టైటిల్‌ను నోయెల్‌కు ఇచ్చారు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ చెబితే మోనాల్ గెస్ చెయ్యాలి. పవర్ స్టార్ ‘జల్సా’ సినిమా వచ్చింది. మోనాల్ గెస్ చేయలేక పోయింది. అవినాష్‌ని అడిగితే ఠక్కున చెప్పేశాడు. ‘జల్సా’ టైటిల్‌ను అరియానాకు ఇచ్చారు. లాస్యకు ‘పోకిరి’ వచ్చింది. ఆ టైటిల్ సొహైల్‌కు ఇచ్చారు. వీడియో చూపించి.. ఆ వీడియోలో ఎవరిని చూపిస్తే వారు సేఫ్ అవుతారని నాగ్ చెప్పారు. వీడియోలో అరియానాను చూపించి సేఫ్ చేశారు. తరువాత ఆట తిరిగి స్టార్ట్ అయింది. ‘డార్లింగ్’ వచ్చింది. దానిని నోయెల్ చెప్పాలి. అవినాష్ డార్లింగ్ అని పోస్టర్‌లో వచ్చింది.

నోయెల్‌కు ‘ఏం మాయ చేశావె’ వచ్చింది. దానిని అభి చెప్పలేకపోయాడు. ఆ టైటిల్ మోనాల్‌కు ఇచ్చారు. అరియానాకు ‘అందాల రాక్షసి’ టైటిల్ వచ్చింది. దానిని అఖిల్ చెప్పేశాడు. ఆ టైటిల్‌ను దివికి ఇచ్చారు. నెక్ట్స్ ‘మత్తు వదలరా’ టైటిల్.. కుమార్ సాయికి ఇచ్చారు. నెక్ట్స్ ‘ఫిదా’ మూవీని లాస్య గెస్ చేయలేకపోయింది. ఆ మూవీ టైటిల్‌ను హారికకు ఇచ్చారు. తరువాత ‘అర్జున్‌రెడ్డి’. ఆ టైటిల్‌ను అఖిల్‌కు ఇచ్చారు. ఫైనల్‌గా ‘పెదరాయుడు’. సొహైల్ చెప్పలేకపోయాడు. ఆ టైటిల్‌ను లాస్యకు ఇచ్చారు. నెక్ట్స్ సేఫ్ అయ్యే కంటెస్టెంట్‌ను అవినాష్ యాక్ట్ చేసి చూపించాలి. దీంతో నోయెల్‌ను సేఫ్ చేశారు. ‘గెస్ట్స్.. స్టాఫ్ అవుతారు.. స్టాఫ్.. గెస్టులవుతారు’ టాస్క్. రివెంజ్‌ను తీర్చుకోవడాన్ని హారికతో ఫస్ట్ అమ్మ రాజశేఖర్ స్టార్ట్ చేశారు. సొహైల్ కోడిలా చేశాడు. రివేంజ్ తీర్చుకున్న తీరు ఫన్నీగా అనిపించింది. నెక్ట్స్ అభి, లాస్య సేఫ్ అయ్యారు. సుజాత, మోనాల్, అమ్మ రాజశేఖర్ మిగిలారు. ఆ ముగ్గురిలో గార్డెన్ ఏరియాకు ఇద్దరు వెళతారు ఒకరు సేఫ్ అవుతారు.

మోనాల్‌ను సేఫ్ చేసి రాజశేఖర్, సుజాతను గార్డెన్ ఏరియాకు పంపించారు. సీన్ గార్డెన్ ఏరియాకు మారింది. ఐస్ కింద ఫోటో పెట్టారు. ఆ ఫోటోలో ఎవరొస్తే వాళ్లు ఎలిమినేట్. సుజాత ఫోటో వచ్చింది. సుజాత ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి సుజాత బయటకు వచ్చేసింది. నాగ్ కొన్ని హార్ట్, బ్రోకెన్ హార్ట్, బ్లాక్ కార్డ్‌లను ఇచ్చి ఎవరికి ఇస్తావని అడిగారు. హార్ట్‌ సింబల్‌ను నోయెల్, లాస్యకు ఇచ్చింది. నోయెల్ తనలా మారి తనలా చూసుకున్నాడని చెప్పింది. బ్రోకెన్ హార్ట్‌ను అభితో పాటు అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, కుమార్ సాయిలకు సుజాత ఇచ్చింది. హార్ట్‌ని అవినాష్‌కి ఇచ్చింది. బ్లాక్ కార్డ్స్‌ను హారిక, దివి, అఖిల్, సొహైల్, మోనాల్‌లకు ఇచ్చింది. బిగ్‌బాంబ్.. ఎవరి మీద వేస్తారో.. వారు వారమంతా గిన్నెలు తోమాలి. బిగ్‌బాంబ్‌ను సుజాత.. కెప్టెన్ సొహైల్ మీద వేసింది. గంగవ్వ, సుజాత ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మొత్తమ్మీద షో సందడి సందడిగా నడిచింది.

More News

కాంగ్రెస్ పార్టీకి ఖుష్బూ రాజీనామా.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక..

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘన విజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

‘ఆదిపురుష్’లో అజయ్ దేవగణ్ పాత్రపై క్లారిటి..!

ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.

‘మహాసముద్రం’లో మధ్య తరగతి అమ్మాయిగా అదితి..

‘సమ్మోహనం’తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అదితిరావు హైదరీ మరో తెలుగు సినిమాలో కనిపించనుంది.

ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితిపై పోలింగ్ ఏజెన్సీ సర్వే..

ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితేంటి? అధికార పార్టీ ప్రభ తగ్గిందా? ప్రతిపక్ష పార్టీకి మద్దతు పెరిగిందా?