అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

  • IndiaGlitz, [Friday,January 29 2016]

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆత‌ర్వాత గంగ్రోతి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అల్లు అర్జున్ రెండ‌వ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌ అఖిల్ విష‌యానికి వ‌స్తే...అక్కినేని ఫ్యామిలీ హీరోలు న‌టించిన మ‌నం సినిమాలో చిన్న పాత్ర‌ ద్వారా అఖిల్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆత‌ర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు అఖిల్.

అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన‌ డాడీ సినిమా సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందింది. అలాగే అఖిల్ ఎంట్రీ ఇచ్చిన‌ మ‌నం సినిమా కూడా సొంత నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో రూపొందింది. అలాగే అల్లు అర్జున్ అంటే ఇంగ్లీషు అక్ష‌రాలు ఎ ఎ. అలాగే అక్కినేని అఖిల్ అంటే ఎ ఎ. ప్ర‌స్తుతం అఖిల్ రెండ‌వ సినిమాని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు...దీనికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

అల్లు అర్జున్ రెండో సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విష‌యం తెలిసిందే. దీనిని బ‌ట్టి చూస్తే...అక్కినేని అఖిల్ కూడా రెండ‌వ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే చేసే అవ‌కాశం ఉంది. మ‌రి..ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

More News

సీక్వెల్ ప్లాన్ లో నాగ్

సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంత‌కీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? స‌ంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి. నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఫిబ్రవరి 19 కి రానున్న 'కృష్ణాష్టమి'

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

బాల‌య్య‌తో ప‌టాస్ డైరెక్ట‌ర్‌....

గ‌తేడాది నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ వంటి సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సుప్రీమ్ సినిమాను చేస్తున్నాడు.

ధైర్యం లేదంటున్న బాలీవుడ్ స్టార్‌...

బాలీవుడ్‌లో యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ఉన్న న‌టుల్లో అక్ష‌య్‌కుమార్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌స్తుతం ఈ హీరోకు అన్నీ శుభ‌వార్త‌లే విన‌ప‌డుతున్నాయి.

ఆ హీరోయిన్ వ‌ద్దంటున్న ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఇటీవ‌లే నాన్న‌కు ప్రేమ‌తో...50 కోట్ల క్ల‌బ్ చేరింది.