close
Choose your channels

ఫిబ్రవరి 19 కి రానున్న 'కృష్ణాష్టమి'

Friday, January 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19 న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది.

"మేము 5 న వచ్చేందుకు రెడీ గా ఉన్నప్పటికీ, 'స్పీడున్నోడు' 5 న, 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' 12 న వస్తామని రిక్వెస్ట్ చేయటం తో, ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్స్ కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశం తో, మా కృష్ణాష్టమి చిత్రాన్ని ఫిబ్రవరి 19 కి వాయిదా వేయటం జరిగింది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ ఫామిలీ ఎంటర్టైనర్ ఆడియో ను ఇటీవలే రాజమండ్రి లో ని GIET కాలేజీ లో చాలా గ్రాండ్ గారిలీజ్ చేసారు. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.