close
Choose your channels

Abhishek Agarwal:కోవిడ్‌ను భారత్‌ అద్భుతంగా హ్యండిల్ చేసింది .. గవాస్కర్ వ్యాఖ్యలు  : నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందన ఇదే

Wednesday, May 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రపంచం మొత్తం కోవిడ్ విలయతాండవంతో వణుకుతున్న వేళ.. భారతదేశం ఆ మహమ్మారికి విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘‘వ్యాక్సినేషన్’’ గురించి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన భారత్.. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసి ఔరా అనిపించుకుంది. కేవలం భారతీయులకే మాత్రమే కాకుండా అవసరంలో వున్న ప్రతి దేశానికి వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. తద్వారా కోవిడ్‌ను తరిమికొట్టే ప్రక్రియలో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాతి నుంచి ప్రపంచ దేశాల్లో ఇండియా పరపతి బాగా పెరిగింది. అమెరికా వంటి దేశాలు కూడా భారత్‌ను, ప్రధాని మోడీ పనితీరును ప్రశంసించాయి.

రెండేళ్ల పాటు ఎటు చూసినా అనిశ్చితే :

ఇదిలావుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కోవిడ్‌ను భారత్ విజయవంతంగా ఎదుర్కొందంటూ ప్రశంసించడంతో బీజేపీ మద్ధతుదారులు సోషల్ మీడియాలోప్రధాని మోడీని ఆకాశానికెత్తేస్తున్నారు. చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రెండేళ్ల పాటు ప్రపంచంలో ఎటు చూసినా అనిశ్చితి.. ఏం జరుగుతుందో తెలియదు. కోవిడ్ ఎప్పుడు ముగుస్తుందో అర్ధం కాలేదు. కానీ ఇంత పెద్ద జనాభాతో భారత్ కోవిడ్‌ను హ్యాండిల్ చేసిన విధానం అద్భుతమైనది. ప్రపంచానికి మనం వ్యాక్సిన్ సరఫరాదారుగా మారాం. ప్రపంచానికి మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను పంపాం. కోవిడ్ జాడ ఇంకా వున్నందున తాను బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకుని తిరుగుతున్నా. కరోనా మహమ్మారిని భారత్ అడ్డుకున్న తీరు అద్భుతం’’ అంటూ గవాస్కర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్‌లో టీకా ప్రాజెక్ట్‌కు ప్రశంసలు :

దీనిపై ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. ఒక్క సునీల్ గావస్కర్ వంటి దిగ్గజం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కోవిడ్‌ను భారత్ అసాధారణంగా మేనేజ్ చేయగలిగిందని ప్రశంసించిందని, ముఖ్యంగా టీకా ప్రాజెక్ట్‌ను మెచ్చుకున్నారని అభిషేక్ ట్వీట్ చేశారు. #TheVaccineWar చిత్రంలో భారత్ నిర్వహించిన వ్యాక్సిన్ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేశారో, అయినప్పటికి ఇండియా విజయం సాధించిందో తెలియజేస్తుందని అభిషేక్ తెలిపారు.

ది వ్యాక్సిన్ వార్‌ను తెరకెక్కిస్తోన్న వివేక్ అగ్నిహోత్రి:

కాగా.. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి చిత్రంగా ‘‘ ది వ్యాక్సిన్ వార్’’ను తెరకెక్కిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా , లాక్‌డౌన్, ప్రజల ఇబ్బందులు, వ్యాక్సిన్ కోసం పడిగాపులు ఇలా ప్రతి అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మొత్తం 11 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి, పరితోష్ సాండ్, పూర్తి జై అగర్వాల్, రణ్‌దీప్ ఆర్య, స్నేహా మిలంద్ తదితరులు నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.