సన్నిలియోన్ తెలుగులో నటిస్తుంది...

  • IndiaGlitz, [Sunday,October 02 2016]

పోర్న్ స్టార్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌న్నిలియోన్ గురించి తెలియ‌ని వారుండ‌రంటే విచిత్ర‌మే. స‌న్నిలియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులో కూడా క‌రెంట్ తీగ చిత్రంలో ఐటెమ్‌సాంగ్‌లో న‌టించింది. త‌ర్వాత ఏ ద‌క్షిణాది సినిమాలో పాట‌ల్లో కానీ సీన్స్‌లో కానీ క‌నిపించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే తెలుగులో ఓ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఆర్‌.కె.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్.ఎం నిర్మాత‌గా రూపొందిన గుంటూరు టాకీస్ సినిమా మంచి ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది. గుంటూరు టాకీస్-2 పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ అక్టోబ‌ర్ 11 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో స‌న్నిలియోన్ ఓ డాన్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నుంది. 20 రోజ‌లు పాటు స‌న్నిలియోన్ పాత్ర చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ట‌. ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన కిర‌ణ్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రానికి నిర్మాత రాజ్‌కుమార్‌.ఎం మెగాఫోన్ చేప‌ట్ట‌నున్నాడట‌. సినిమాను గుంటూరు టాకీస్ విడుద‌లైన మార్చి నెల‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

'అప్పట్లో ఒకడుండేవాడు' - ఎగ్జయిటింగ్ కాంటెస్ట్

అప్పట్లో ఒకడుండేవాడు అని చాలా మంది తమ మాటల్లో అంటూ ఉండటం మనం చాలా సార్లు వినే ఉంటాం.జనాల నోళ్లలో బాగా నానిన అదే మాటతో సినిమా చేస్తున్నారు నారా రోహిత్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'హైపర్ ' స్పెషల్ షోలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్'.

నేను ఏ సినిమా అయినా సైన్ చేయాలంటే ఆ రెండు నచ్చాలి - రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల కథానాయిక రాశీ ఖన్నా.

అక్టోబర్ 5న నందమూరి కళ్యాణ్ రామ్ , పూరి జగన్నాథ్ ల 'ఇజం' ఆడియో

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై,నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఇజం'.

తెర పై ఎం.ఎస్.ధోని రికార్డ్..!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ మూవీ ఎం.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ.