close
Choose your channels

అక్టోబర్ 5న నందమూరి కళ్యాణ్ రామ్ , పూరి జగన్నాథ్ ల 'ఇజం' ఆడియో

Sunday, October 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 5 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతుంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న 'ఇజం' చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ తో, టోటల్ న్యూ లుక్ లో కనపడుతోన్న కళ్యాణ్ రామ్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం టీజర్ కి ఒకే ఛానల్ లో సుమారు 16 లక్షల వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రం లో హీరోయిన్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ మరియు స్పెయిన్ లో చిత్రీకరించారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

"ఈ సినిమా పాటలను అధికారక యూ ట్యూబ్ చానెల్ తోపాటు iTunes, Saavn,Wynk,Eros Now, Raaga and Hungama ద్వారా కూడా వినొచ్చు" అని ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.