అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

  • IndiaGlitz, [Friday,January 11 2019]

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగకి ఎఫ్ 2 రావడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం. కథ, దర్శకుడిని నమ్మి సినిమా చేశాను. చాలా నేచురల్‌గా చేశాను. అనీల్ కూడా చాలా ఫ్రీ డమ్ ఇచ్చి చేయించుకున్నాడు. వరుణ్‌తేజ్, రాజేంద్రసాద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించింది. తమన్నా, మెహరీన్ వండర్ వర్క్ చేశారు. అన్నారు.

వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఫస్ట్ టైం ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. కామెడీ క్యారెక్టర్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు అయిపోయిందో తెలియడం లేదు. ఈ జర్నీ నాకు మెమొరబుల్‌గా ఉండిపోతుంది. ఆయన నా జర్నీ ఓ నటుడిగా ప్రారంభమై, బ్రదర్‌లా మారింది. ఈ సినిమాతో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ఫిదా చేశాం. మా పెద్దనాన్నగారి కాన్‌టెంపరరీ హీరో వెంకటేష్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. ఫ్రెండ్‌లా, మెంటర్‌లా మాతో ఉన్నారు. నెక్స్‌ట్ టైం ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి నేను రెడీ. ఈ సినిమాలో మా ఇద్దరి బ్రోమాన్స్ అద్భుతంగా ఉండబోతోంది.  అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఓ సినిమా సిద్ధం అవ్వడానికి 24 క్రాఫ్ట్స్ కష్టం ఉండాల్సిందే. ఈ సినిమాకీ మేమంతా అలానే కష్టపడ్డాం’’ అన్నారు. ఇంకా  ఈ కార్యక్రమంలో తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. 

More News

సమంత యంగ్ లుక్‌లోనే...

కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు, కమ‌ర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసిన సమంత ఇప్పుడు వైవిధ్యైమెన పాత్రలు చేయుడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.

జగన్ సమక్షంలో వైసీపీ గూటికి సీనియర్ నటుడు

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టి పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగించారు.

ఏప్రిల్‌లో 'దబాంగ్ 3'

సల్మాన్‌ఖాన్‌కి క్రేజ్ తెచ్చిన చిత్రాల్లో 'దబాంగ్' ఒకటి. ఈ సినిమాను సీక్వల్‌గా 'దబాంగ్ 2'ను కూడా తెరకెక్కించారు.

తెలుగులో వివాదస్పద చిత్రం

మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ జీవిత కథను 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' అనే పేరుతో సినిమాగా తెరకెక్కించారు.

విజయ్ దేవరకొండతో క్యాథరిన్

చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా తెలుగులో నటించనుంది. ఇంతకు ఏ హీరోతో అనుకుంటున్నారా!.