రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఉదయం కేంద్రం ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రజినీకాంత్‌కు ఈ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న దక్షిణాది వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉండటం విశేషం. దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేషన్‌(తమిళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్‌(తెలుగు), ఇక కన్నడ నుంచి రాజ్‌కుమార్‌, మలయాళం నుంచి గోపాలకృష్ణన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కూడా ఈ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

More News

అక్షయ్ కుమార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సూపర్ సక్సెస్‌తో లాక్‌డౌన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్.. తన స్టార్ డమ్‌ని కొనసాగిస్తూనే ఉన్నారు.

లేడీ సింగం ఆత్మహత్య కేసులో మరో అధికారి సస్పెన్షన్

మహారాష్ట్రలో వేళ్లూనుకున్న స్మగ్లింగ్ ఆట కట్టించి లేడి సింగంగా గుర్తింపు పొందిన అటవీశాఖ అధికారిణి దీపాళీ చవాన్(28) ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది.

నాన్న నేను మోసపోయానంటూ.. సెల్ఫీ వీడియో తీసి యువతి ఆత్మహత్య

ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుంది.. వాడి తర్వాతే ఎవరైనా అనుకుంది.. కానీ అతడలా భావించలేదు..

బీబీ 3... బోయపాటి అలా ప్లాన్ చేస్తున్నాడా?‌

‘సింహ‌, లెజెండ్’ చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై స్పందించిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.