close
Choose your channels

వైఎస్ జగన్‌కు సుప్రీం షాక్.. రేవంత్‌కు ఊరట

Wednesday, March 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్‌కు సుప్రీం షాక్.. రేవంత్‌కు ఊరట

ఏపీ సీఎం వైఎస్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊహించని షాకిచ్చింది. మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. వీరిద్దరికీ సంబంధమేంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు అనుకున్నది నిజమే.. ఈ ఇద్దరికీ ఎలాంటి సంబంధమే లేదు. అసలు జగన్‌కు రేవంత్ అస్సలే సరిపోడు..? అసలు జగన్‌కు సుప్రీం ఎందుకు షాకిచ్చింది..? రేవంత్ రెడ్డికి ఏ విషయంలో హైకోర్టు ఊరటనిచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జగన్ విషయానికొస్తే..!

కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై సీఎం జగన్ మొదలుకుని మంత్రులు, నేతలు, సీఎస్ వరకూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం.. ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు యథావిధిగా జరిగేలా చూడాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు బుధవారం నాడు విచారించింది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకోలేం. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయాధికారం’ అని తీర్పు నిచ్చింది. అంటే ఏపీ ప్రభుత్వ వాదనలను పక్కనెట్టింది. అంతేకాదు.. ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

రేవంత్ విషయానికొస్తే..

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ మీద అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా.. 14 రోజులుగా రేవంత్ చర్లపల్లి జైలులో సంగతి తెలిసిందే. అయితే.. మొదట బెయిల్ పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్ట్ తోసిపుచ్చింది. అయితే రేవంత్ లాయర్ హైకోర్టును ఆశ్రయించడంతో బుధవారం నాడు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా.. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీంతో ఆయనకు బెయిల్‌ను అంగీకరిస్తూ బుధవారం నాడు మంజూరు చేసింది.

సో.. మొత్తానికి చూస్తే ఏపీ సీఎం జగన్‌కు సుప్రీం కోర్టు షాకివ్వగా.. రేవంత్ రెడ్డికి హైకోర్టు శుభవార్త చెప్పిందన్న మాట. ఇప్పటికే లోకల్ ఎలక్షన్స్ విషయంలో ఎలా ముందుకెళ్తుందో..? ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టు అన్నీ అయిపోయాయ్.. మరి తదుపరి నిర్ణయమేంటి..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.