close
Choose your channels

సూర్య 40 ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే

Thursday, July 22, 2021 • తెలుగు Comments

సూర్య 40 ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే

జూలై 23న హీరో సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సూర్య 40 వ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయింది. పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఊరమాస్ గా ఉంది.

ఇదీ చదవండి: ప్రియమణి వివాహం చెల్లదు.. ఆమె భర్త మొదటి భార్య షాకింగ్ కామెంట్స్!

సూర్య పంచె కట్టులో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసి విధంగా ఉంది. పంచెకట్టుతో ఉన్న సూర్య చేతిలో ఖడ్గంతో కనిపిస్తున్నాడు. డార్క్ ప్లేస్ లో రౌడీని చంపి లాక్కుని వెళుతున్న దృశ్యం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. దీనికి తోడు ఇమాన్ బ్యాగ్రౌండ్ సంగీతం అదుర్స్ అనిపిస్తోంది.

సూర్య 40 ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే

ఈ చిత్రానికి 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయిన భీకరంగా, ధైర్యంగా ఉండేవాడు అనే అర్థం వస్తుంది. మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి.

సూర్య 40 ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే

ప్రియాంక అరుళ్ మోహన్ సూర్యకు జోడిగా ఈ చిత్రంలో నటిస్తోంది. సూర్య చివరగా నటించిన 'ఆకాశం నీ హద్దురా'చిత్రం అతడికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. అది విభిన్నమైన అటెంప్ట్. ఈసారి సూర్య మాస్ జాతర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌ చిత్రంలో ఫుల్ గా మాస్ అంశాలు ఉంటూనే సందేశం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz