న‌వ‌ల ఆధారంగా హీరో సూర్య సినిమా

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు హీరో సూర్య‌. ఈ సినిమా త‌ర్వాత అసుర‌న్ దర్శ‌కుడు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి 'వాడివాస‌ల్‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తెలుగు టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. జ‌ల్లిక‌ట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాస‌ల్ అంటారు. వివ‌రాల ప్ర‌కారం సీఎస్‌.చెల్ల‌ప్ప అనే ర‌చ‌యిత రాసిన న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. దానికి సంబంధించిన హ‌క్కుల‌ను కూడా సూర్య అండ్ టీమ్ ద‌క్కించుకుంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అసుర‌న్ వంటి ర‌స్టిక్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెట్రిమార‌న్.. సూర్య సినిమాను కూడా ర‌స్టిక్‌గానే తెర‌కెక్కిస్తాడ‌ని టాక్‌.

More News

ఈ మూడ్రోజుల్లో 3 రాజధానులపై తేలిపోనుంది!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బొంబాట్‌లో `ఇష్క్ కియా...' సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని

'డిస్కోరాజ' సెకండ్ టీజర్ విడుదల

మాస్ మహా రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీజేపీకి ఊహించని షాక్!

ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఆప్ ఊహించని షాకిచ్చింది.

ఢిల్లీలో పవన్ ‘పొత్తు’ బిజీ.. బాంబ్ పేల్చిన కీలకనేత!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి ఫిక్స్ అయ్యారా..? రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా..?