close
Choose your channels

మ‌ణిర‌త్నంతో సూర్య‌!!

Tuesday, July 14, 2020 • తెలుగు Comments

మ‌ణిర‌త్నంతో సూర్య‌!!

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత హీరో సూర్య‌తో గ‌తంలో యువ సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌బోతున‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌బోయేది సినిమా కోసం కాద‌ట‌.. వెబ్ కోస‌మ‌ని టాక్‌. న‌ట‌నా రంగంలో న‌వ‌ర‌సాల‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటాయి. వీటి ఆధారంగా చేసుకుని మ‌ణిర‌త్నం ‘నవరస’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మ‌ది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ర‌సం చుట్టూ తిరుగుతుంటుంది.

అలాగే ఒక్కొక్క ఎపిసోడ్‌ను మ‌ణిర‌త్నంతో క‌లిపి తొమ్మిది మంది ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఓ ఎపిసోడ్‌లో సూర్య న‌టిస్తాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. అంతే కాకుండా విక్ర‌మ్‌, మాధ‌వ‌న్‌, సిద్ధార్థ్ వంటి హీరోలు కూడా న‌టించే అవ‌కాశాలున్నాయని అంటున్నారు. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం మ‌ణిర‌త్నం ఈ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి మ‌ణిర‌త్నంతో పాటు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌బోయే దెవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz