సుష్మాకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

కేంద్ర మాజీ మంత్రి, సాయం అడిగితే కాదనకుండా చేసే సుష్మాస్వరాజ్‌ అలియాస్ చిన్నమ్మ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. బుధవారం సాయంత్రం ఢిల్లీలో లోధి రోడ్డులోని శ్మశానవాటికలో పోలీసు బలగాల గౌరవ వందనం అనంతరం అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. చిన్నమ్మ అంతిమ సంస్కారాలను ఆమె కుమార్తె బన్సూరీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్తె, భర్త ఇద్దరూ సుష్మాకు కడసారి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు విషణ్ణ వదనంతో హాజరయ్యారు.

అంతకుముందు సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమెను కడసారి చూసేందుకు నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన సుష్మా పార్థివ దేహాన్ని లోధి రోడ్డులోని శ్మశానవాటికకు వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.

కాగా.. సుష్మా స్వరాజ్‌ మరణం పట్ల పాకిస్థాన్ శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ సంతాపం వ్యక్తం చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. శత్రుదేశమైన పాక్ వ్యక్తి కూడా చిన్నమ్మకు సంతాపం తెలిపారంటే ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ట్విటర్ వేదికగా ఆమెతో వాగ్వివాదానికి దిగే అవకాశం కోల్పోతున్నానని గత అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయన... సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని హుస్సేన్ ట్వీట్ చేశారు.

మరోవైపు.. చిన్నమ్మ మృతికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా సంతాపం తెలిపి.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజల పట్ల ఎంతో దయ, స్నేహభావంతో మెలిగేవారని సుష్మా సేవలను దలైలామా కొనియాడారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కూడా సంతాపం తెలిపింది. దేశం ఇటీవల తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పట్ల సుష్మా స్వరాజ్‌ చాలా ఆనందం వ్యక్తం చేశారని పేర్కొంది. ఆమె కుటుంబానికి ఓ ప్రకటనలో తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

More News

సాహో లో స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్ చేసిన చుంకి పాండే... పోస్టర్

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు.

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కిన చిత్రం ‘సాహో’.

'రణరంగం' సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

ముందుగానే `రూలర్` వచ్చేస్తున్నాడా?

బాల‌య్య రౌడీయా?  పోలీసా?  రౌడీగా రూల్ చేస్తారా?  పోలీస్‌గా రూల్ చేస్తారా?  ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూల‌ర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహ‌లంగా ఉంది.

ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిపిన రాజశేఖర్

నాలుగేళ్లు ఎంబిబిఎస్ చదివి, తర్వాత ఓ ఏడాది హౌస్ సర్జన్ గా సేవలు చేస్తే ప్రభుత్వం డాక్టర్ పట్టా చేతికి వస్తుంది.