‘చిన్నమ్మ’ సుష్మా చివరి ట్వీట్ ఇదే...

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

బీజేపీ సీనియర్ నేత, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాధరణ కలిగిన సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చిన్నమ్మ మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అడిగిన వారికి సాయం చేసే చిన్నమ్మ మరణ వార్త బీజేపీకి కోలుకోలేని షాక్ అని చెప్పుకోవచ్చు. మంగళవారం నాడు జమ్ముకశ్మీర్ విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం విదితమే. ఈ బిల్లు ఆమోదం అనంతరం మోదీ సర్కార్‌ను అభినందిస్తూ సుష్మా ట్వీట్ చేశారు. ఇదే చిన్నమ్మ చివరి ట్వీట్ కావడం గమనార్హం.

చిన్నమ్మ చివరి ట్వీట్ సారాంశం ఇదీ..

థ్యాంక్యూ ప్రైమ్‌ మినిస్టర్‌ మోదీజీ. థ్యాంకూ వెరిమచ్‌. నా జీవితంలో ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్‌ షా హుందాగా ప్రవర్తించారని సుష్మా స్వరాజ్ ప్రశంసించారు. కాగా మోదీపై ట్వీట్ చేసిన అనంతరం ఆమె తీవ్ర అస్వస్థతకు లోనుకావడం ఐదుగురు డాక్టర్ల బృందం రంగంలోకి సాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ సుష్మాను కాపాడలేకపోయారు.

More News

ఉభయసభల్లో కశ్మీర్‌ విభజన బిల్లు ఆమోదం

జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం నాడు లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కాగా.. ఈ బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు.. వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి.

'మన్మథుడు 2' సెన్సార్ పూర్తి

టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `మన్మథుడు 2`. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ ఇక లాంఛనమే.

డిజిటల్ రంగంలోకి మీనా

సీనియర్ హీరో మీనా.. ఒకప్పుడు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోస్ జతగా నటించారు. పెళ్లి తర్వాత సినిమా రంగానికి దూరంగా ఉన్న

పీవోకే భారత్‌లో అంతర్భాగమే.. ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసు!

కశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం నాడు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా మొదట లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

పొగ తాగితే తప్పేంటి? అని అంటున్న- రకుల్

రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన చిత్రం `మన్మథుడు 2`. ఈ చిత్రంలో ఈమె అవంతిక అనే పోర్చుగల్ అమ్మాయిగా నటించింది.