సెన్సార్ పూర్తి చెసుకున్న "సువ‌ర్ణ‌సుంద‌రి" 

  • IndiaGlitz, [Friday,May 24 2019]

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చెసుకుని మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా.... నిర్మాత ల‌క్ష్మీ మాట్లాడుతూ... సువర్ణ సుందరి చిత్ర సెన్సార్ కంప్లీట్ అయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది.ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌డ్జెట్ ను మించి క్వాలిటి ఔట్ పుట్ రావటం సినిమా సక్సెస్ పై కాన్పిడెన్స్ ను పెంచిందన్నారు.

దర్శకుడు ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి లాంటి కంటెంట్ ఉన్న సినిమాకు నేను డైరెక్ట‌ర్‌గా వర్క్ చెయటం గర్వంగా ఉంది. స్టోరీ డిమాండ్ కు తగ్గట్టుగా క్వాలిటీ తో సినిమాను చేశాం. సెన్సార్ సభ్యులు మా సువర్ణ సుందరి ని చూసి టీమ్ ను అభినందించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే అన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

More News

సుడిగాలి సుధీర్‌ హీరోగా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రం

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా  ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా

అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు ల చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో

‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి జూన్ 14 న విడుదల

‘గేమ్ ఓవర్’ ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం

ర‌కుల్ ఆ హీరోను పెళ్లి చేసుకునేద‌ట‌

ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల్లో స్టార్ హీరోల‌తో న‌టించి మెప్పించిన ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఈ అమ్మ‌డు బాలీవుడ్‌లో రాణించాల‌ని చాలా ఏళ్లుగా క‌ల‌లు కంటుంది.

సూప‌ర్ 30 రిలీజ్ తెలిస్తే షాకే!

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోష‌న్ అంటే వెంట‌నే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది అత‌ని ఫిజిక్‌, లుక్‌.. ఇవ‌న్నీ ఒకప్పుడు, ఇప్పుడు హృతిక్ అంటే కంగనార‌నౌత్ గుర్తుకు వ‌స్తుంది.