'సైరా నరసింహారెడ్డి' అప్ డేట్స్

  • IndiaGlitz, [Friday,January 05 2018]

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి'. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ ఇది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన రెండవ షెడ్యూల్ ని సంక్రాంతి పండగ కారణంగా వాయిదా వేసారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ కి సంక్రాంతి సెలవులను ప్రకటించారు నిర్మాత.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఆరంభం కానుంది. దీని కోసం తమిళనాడులోని పొల్లాచ్చికి బయలుదేరనుంది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుండగా...అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జ‌గ‌ప‌తిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ కెమెరామేన్ ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. 2019లో సైరా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

More News

చిన్నారి పాట‌కు ప‌వ‌న్ ఫిదా

ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. కాని ఇప్పుడు ఓ ఎనిమిది సంవత్సరాల బాలుడికి అభిమాని అయిపోయారు ప‌వ‌న్‌.

సినిమాని ఆదరిస్తున్నందుకు కృతఙ్ఞతలు... కానీ హీరో సందీప్ కిషన్ నా విలన్ : ఎస్ కె బషీద్

ఎస్ బి కె ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై ఎస్ కె అబ్దుల్లా సమర్పించిన చిత్రం ప్రాజెక్ట్ Z

ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ చిత్రం షూటింగ్ ప్రారంభం

రాజాదిగ్రేట్ లాంటి గ్రాండ్ సక్సెస్ త‌రువాత మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా , సోగ్గాడే చిన్న‌నాయ‌న‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారీ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి  నిర్మాత గా తొలి చిత్రం తెర‌కెక్కనుంది.

అనుష్కలా పేరు తెచ్చుకోవాలనుకుంటోన్నా - రషీకా దత్

తెలుగు తెరకు మరో కన్నడ సోయగం రాబోతోంది.పేరు రషీకా దత్.

అన్నపూర్ణ స్టూడియోస్ లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీ - రాజ్ తరుణ్

2017లో 'రారండోయ్','హలో'వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.