close
Choose your channels

'సైరా నరసింహారెడ్డి' అప్ డేట్స్

Friday, January 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి`. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ ఇది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన రెండవ షెడ్యూల్ ని సంక్రాంతి పండగ కారణంగా వాయిదా వేసారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ కి సంక్రాంతి సెలవులను ప్రకటించారు నిర్మాత.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఆరంభం కానుంది. దీని కోసం తమిళనాడులోని పొల్లాచ్చికి బయలుదేరనుంది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుండగా...అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జ‌గ‌ప‌తిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ కెమెరామేన్ ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. 2019లో సైరా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.