కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి'..!!

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ' నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ లో 'ఫనా', 'హమ్ తుమ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది..

లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని చిత్ర నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు..

నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

More News

కూలిన క‌టౌట్.. ఫ్యాన్స్‌పై కంప్లైంట్‌

త‌మిళ హీరో విజ‌య్ స‌ర్కార్ విడుద‌ల సంద‌ర్భంగా 50 అడుగుల క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులు. ఇదొక రికార్డ్ అని అంద‌రూ అనుకున్నారు.

'స‌ర్కార్‌' కు మ‌హేశ్ అభినంద‌న‌

త‌మిళ హీరో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'స‌ర్కార్‌'. దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

బాలీవుడ్ చిత్రంలో శౌర్య హీరోయిన్‌...

నాగ‌శౌర్య జ‌త‌గా @న‌ర్త‌న‌శాల చిత్రంలో న‌టించిన క‌శ్మీరా ప‌ర‌దేశికి చాలా మంచి ఆఫ‌ర్ ద‌క్కింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ చిత్రంలో న‌టించబోతుంది క‌శ్మీరా.

విక్ర‌మ్ కొత్త మూవీ టైటిల్‌, లుక్ విడుద‌ల‌

విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్

అల‌నాటి హీరోయిన్‌గా అనుష్క‌..

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'