త‌మ‌న్నా ఓటీటీ డీల్‌..!

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా. ఈ ముంబై ముద్దుగుమ్మ అచి తూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. భారీగానే రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తుంది. న‌చ్చిన సినిమాల‌ను చేస్తున్న త‌మ‌న్నా నిన్న మొన్న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన హీరోయిన్స్‌కు కూడా గ‌ట్టిపోటీనే ఇస్తుంది. అయితే ఇప్పుడు సినిమా రూపు మార‌తుంది. వెండితెర నుండి డిజిట‌ల్ రంగం వైపుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర‌వింద్ తెలుగు ఓటీటీ యాప్ ఆహాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆహాను తెలుగు వారికి మ‌రింత చేరువ చేయ‌డానికి అల్లు అర‌వింద్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. టాలీవుడ్‌లోకి కొంత మంది పేరెన్న‌త‌గ్గ ద‌ర్శ‌కుల‌ను, కంటెంట్ రైటర్స్‌ను ఆహా కోసం కంటెంట్ జ‌న‌రేట్ చేయ‌మ‌ని కోరాడు. అలాగే న‌వదీప్‌, హెబ్బా ప‌టేల్ వంటి స్టార్స్‌ను వెబ్ సిరీస్‌ల్లో న‌టింప చేస్తున్నారు. ఇవి కాకుండా ఓ టాక్‌షోను అర‌వింద్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ టాక్ షోకు త‌మ‌న్నా వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త‌మ‌న్నాతో చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌నుంద‌ట‌.

More News

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.

చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన  యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి.

బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.

తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.