తమన్నా పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌!!

  • IndiaGlitz, [Wednesday,August 26 2020]

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించిన త‌మ‌న్నా భాటియా.. ఈరోజు త‌న త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందనే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. వివ‌రాల్లోకెళ్తే.. రెండు, మూడు రోజులుగా త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌టంతో కుటుంబంతో స‌హా అంద‌రూ క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. టెస్టులో త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ రిజిల్ట్ రాగా.. త‌మ‌న్నా, ఇత‌ర సిబ్బందికి క‌రోనా నెగ‌టివ్ రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు త‌మ‌న్నా. అంద‌రి ప్రార్థ‌న‌లు, దేవుడి ఆశీర్వాదాలు, ద‌య‌తో వారు త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని భావిస్తున్న‌ట్లు త‌మ‌న్నా తెలిపారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్‌తో క‌లిసి త‌మ‌న్నా ఓ సినిమా చేస్తుంది. మ‌ల‌యాళ చిత్రం ‘ల‌వ్‌మాక్‌టైల్‌’కు తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ఖ‌రారైంది. ఈ నెల 28 న సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి దర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే తెలుగు ఓటీటీలోనూ తమన్నా ఓ స్పెషల్ షో చేయనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

More News

ప్ర‌భాస్ .. సీత ఎవ‌రు?

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో

డ్రగ్ డీలర్‌తో రియా చాటింగ్ గుట్టు రట్టు..

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు మొత్తం ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టే తిరుగుతోంది.

క్షీణిస్తోన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆర్మీ ఆసుపత్రి బుధవారం వెల్లడించింది.

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. తిరిగి షూటింగ్‌కి వచ్చేశా: ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చాలా కాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. ఐదు నెలల కాలంగా సినీ పరిశ్రమ స్తంభించి పోయింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి షాక్..

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన  స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.