బాల‌య్య‌కు పోటీగా త‌మిళ హీరో?

  • IndiaGlitz, [Friday,November 08 2019]

త‌మిళ హీరోల్లో సూర్య‌, కార్తిల‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే వారి సినిమాలు ఇటు తెలుగు, అటు త‌మిళంలో ఒకేసారి విడుద‌లవుతుంటాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను చేస్తూ సూర్య, కార్తి త‌మకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ ఏడాదిలో కార్తి విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా దీపావ‌ళికి ఖైదీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇటు తెలుగు, అటు త‌మిళంలో విజ‌యాన్ని సాధించాడు. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సినిమా కంటే ఖైదీకే ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కింది.

దీపావ‌ళికి ఓ పెద్ద త‌మిళ స్టార్ హీరోతో పోటీ ప‌డ్డ కార్తి.. అప్పుడే మ‌రోసినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే క్రిస్మ‌స్‌కి కార్తి తంబి అనే సినిమాతో రాబోతున్నాడు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్‌. ఈ సినిమాలో కార్తితో పాటు ఆయ‌న వ‌దిన, సూర్య భార్య‌, హీరోయిన్ జ్యోతిక కూడా న‌టించింది. ఈ క్రిస్మ‌స్‌కి తెలుగులో ఓ ప‌క్క బాల‌కృష్ణ 'రూల‌ర్‌', సాయితేజ్ 'ప్ర‌తిరోజూ పండ‌గే' చిత్రాలు రానున్నాయి. వీటితో పాటు స‌ల్మాన్ 'ద‌బాంగ్ 3' కూడా విడుద‌ల కానుంది. మ‌రి ఈ భారీ చిత్రాల మ‌ధ్య పోటీలో దిగ‌డానికి కార్తి రెడీ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

More News

పారిస్‌లోని పలు సుందరమైన ప్రదేశాలలో 'సామజవరగమన' చిత్రీకరణ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'అల వైకుంఠపురంలో'.

డిసెంబర్‌ 6న 'పానిపట్‌' విడుదల

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ 'పానిపట్‌.

చిరు ‘రుద్రవీణ’ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు!

టాలీవుడ్‌లో అప్పట్లో.. మాస్ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో చిరంజీవి తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సామాన్య పాత్రలో అసామాన్య చిత్రం ‘రుద్రవీణ’. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించారు.

జక్కన్న ‘RRR’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి

మద్యం నియంత్రణపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మద్యం నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.