close
Choose your channels

బాల‌య్య‌కు పోటీగా త‌మిళ హీరో?

Friday, November 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య‌కు పోటీగా త‌మిళ హీరో?

త‌మిళ హీరోల్లో సూర్య‌, కార్తిల‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే వారి సినిమాలు ఇటు తెలుగు, అటు త‌మిళంలో ఒకేసారి విడుద‌లవుతుంటాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను చేస్తూ సూర్య, కార్తి త‌మకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ ఏడాదిలో కార్తి విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా దీపావ‌ళికి ఖైదీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇటు తెలుగు, అటు త‌మిళంలో విజ‌యాన్ని సాధించాడు. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సినిమా కంటే ఖైదీకే ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కింది.

దీపావ‌ళికి ఓ పెద్ద త‌మిళ స్టార్ హీరోతో పోటీ ప‌డ్డ కార్తి.. అప్పుడే మ‌రోసినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే క్రిస్మ‌స్‌కి కార్తి తంబి అనే సినిమాతో రాబోతున్నాడు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్‌. ఈ సినిమాలో కార్తితో పాటు ఆయ‌న వ‌దిన, సూర్య భార్య‌, హీరోయిన్ జ్యోతిక కూడా న‌టించింది. ఈ క్రిస్మ‌స్‌కి తెలుగులో ఓ ప‌క్క బాల‌కృష్ణ `రూల‌ర్‌`, సాయితేజ్ `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రాలు రానున్నాయి. వీటితో పాటు స‌ల్మాన్ `ద‌బాంగ్ 3` కూడా విడుద‌ల కానుంది. మ‌రి ఈ భారీ చిత్రాల మ‌ధ్య పోటీలో దిగ‌డానికి కార్తి రెడీ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.