close
Choose your channels

అందుకనే...నరుడాడోనరుడా సక్సెస్ అవుతుంది - తనికెళ్ల భరణి..!

Thursday, November 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌చ‌యిత‌గా, న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా... ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి త‌నికెళ్ల భ‌ర‌ణి. దాదాపు మూడు వంద‌ల చిత్రాల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన త‌నికెళ్ల భ‌ర‌ణి న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. సుమంత్ హీరోగా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌రుడా డోన‌రుడా చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో త‌నికెళ్ల‌భ‌ర‌ణి ప్ర‌ధాన పాత్ర పోషించారు. స‌రికొత్త క‌థాంశంతో రూపొందిన న‌రుడా డోన‌రుడా చిత్రం ఈనెల 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా త‌నికెళ్ల భ‌ర‌ణి తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...!
విక్కీడోన‌ర్ రీమేక్ లో మీరు న‌టించాలి అన్న‌ప్పుడు మీ రియాక్ష‌న్ ఏమిటి..?
విక్కీడోన‌ర్ సినిమా చూసి షాక్ అయ్యాను. ఈ సినిమాను తెలుగులో తీస్తే చూస్తారా అనిపించింది. గ‌తంలో సిగ‌రెట్ తాగ‌డం అంటే నేరం. మందు తాగుతున్నాడు అంటే హ‌వ్వా..అనే వాళ్లు. ఇప్పుడు ఎవ‌డైనా మందు తాగడు అంటే వింత‌గా చూస్తున్నారు. కాలం మారుతుంది కాబ‌ట్టి ఈ క‌థాంశంను కూడా అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది సున్నిత‌మైన అంశం. అందుచేత ఫ‌స్ట్ సాఫ్ట్ గా చెప్పి చివ‌రికి వ‌చ్చేస‌రికి ఆర్ధ్రంగా క‌న్నీళ్లు వ‌చ్చేలా చూపించాం.
సీనియ‌ర్ రైట‌ర్ గా మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఏమైనా ఇచ్చారా..?
ఈ చిత్రానికి వ‌ర్క్ చేసిన రైట‌ర్స్ బాగా రాసారు. అందుచేత నేనేమి పెద్ద‌గా స‌ల‌హాలు ఏమీ ఇవ్వ‌లేదు. అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న స‌ల‌హాలు ఇచ్చాను అంతే..!
ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు క‌దా..! కార‌ణం..?
య‌మ‌లీల సినిమాలో హీరో తో స‌మానంగా ఉండే క్యారెక్ట‌ర్ చేసాను. అలాగే క‌న‌క మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ సినిమాలో కూడా అలాంటి క్యారెక్ట‌రే చేసాను. మ‌ళ్లీ చాలా కాలం త‌ర్వాత ఈ సినిమాకి స‌గం బాధ్య‌త తీసుకున్నాను.ఈ సినిమాతో నాకు మ‌రో నాలుగైదు క్యారెక్ట‌ర్స్ చేసే అవకాశం వ‌స్తుంది. నా స్ధాయిని మ‌రింత పెంచే సినిమా అవుతుంది. అందుక‌నే ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అన్నాను.
మీ క్యారెక్ట‌ర్ ను ఆడియోన్స్ ఆద‌రిస్తారు అనుకుంటున్నారా..?
నేను దుర్మార్గుడుగా, వెధ‌వ‌గా న‌టిస్తే ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఈ సినిమాని చిత్త‌శుద్దితో చేసాను అందుచేత ఖ‌చ్చితంగా నా పాత్ర‌ను ఆద‌రిస్తార‌ని నా న‌మ్మ‌కం
ఒక సీన్ ఉన్న సినిమాలు కూడా చేసి ఉంటారు క‌దా..! అలాంట‌ప్పుడు ఆ సినిమా పై ప్రేమ ఉంటుందా..?
ఒక సీన్ అయినా ఆ సీన్ న‌చ్చితేనే చేస్తాను అందుచేత ఒక సీన్ చేసిన సినిమా అయినా ప్రేమ ఉంటుంది. అత‌డు సినిమాలో నా సీన్స్ ను షూట్ చేసింది నాలుగు రోజుల్లోనే. ఆడు మ‌గాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయ్యింది.? ఈ డైలాగ్ తో ఆడు మ‌గాడ్రా బుజ్జి సినిమా కూడా వ‌చ్చింది క‌దా..! నేను ఎప్ప‌టి నుంచో ఇండ‌స్ట్రీలో ఉన్నాను క‌నుక ఒక్కొక్క‌సారి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఒక సీన్ అయినా చేయాల్సి వ‌స్తుంటుంది. అయినా...ఒక్క సీనే అయినా మ‌న మీద గౌర‌వంతో ఇచ్చారు అని, ఆ ఒక్క సీన్ లోనే మ‌న‌మేంటో చూపించాలి అని ఛాలెంజ్ గా తీసుకుని చేస్తుంటాను.
సుమంత్ తో గ‌తంలో కూడా క‌లిసి న‌టించారు క‌దా..! ఇప్పుడు సుమంత్ లో గ‌మ‌నించిన మార్పు ఏమిటి..?
అక్కినేని వంశంలో అంద‌రితో క‌లిసి న‌టించాను. సుమంత్ తో గ‌తంలో చాలా సినిమాల్లో న‌టించాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే...ఈ సినిమాకి అన్నీ తానై చేసాడు. సుమంత్ వ‌ర్క్ చేయ‌డం చూసి నాకు లేడీస్ టైల‌ర్ రోజులు గుర్తుకువ‌చ్చాయి. సుమంత్ లో కొత్త‌కోణం ను ఆవిష్క‌రించే సినిమా ఇది.
ఈ సినిమా మీలో ఏమైనా మార్పు తీసుకువ‌చ్చిందా..?
నిజంగానే ఈ సినిమా నాలో మార్పు తీసుకువ‌చ్చింది. నా మిత్రుడుకు 7 సంవ‌త్స‌రాల నుంచి పిల్ల‌లు లేరు. ఓరోజు త‌ను ఏమ‌న్నాడంటే...బైక్ పై వెళుతున్న‌ప్పుడు పిల్ల‌లు క‌నిపిస్తే హ్యాండిల్ వ‌దిలేస్తున్నాను వాళ్లను అలా చూస్తుండిపోతున్నాను అన్నాడు. పిల్ల‌లు లేరు అని ఎవ‌రైనా చెప్పినా పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడిని కాదు. అయితే...పిల్ల‌లు లేక‌పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసింది.
ఈ సినిమాకి మీరు ఏమైనా టైటిల్ సూచించారా..?
తెలుగువీర‌లేవ‌రా అనే టైటిల్ అయితే బాగుంటుంది అని చెప్పాను. కానీ...ఎందుక‌నే వాళ్ల‌కు న‌చ్చ‌లేదు (న‌వ్వుతూ...)
న‌రుడా డోన‌రుడా స‌క్సెస్ అవుతుంది అనుకుంటున్నారా..?
మ‌న వాళ్లు ఉన్న‌ది ఉన్న‌ట్టు తీయ‌రు. కానీ...ఈ సినిమాని కొన్ని చిన్న చిన్న మార్పులుతో ఉన్న‌ది ఉన్న‌ట్టు తీసారు. అందుచేత స‌క్సెస్ అవుతుంది అనుకుంటున్నాను.
మీ ద‌ర్శ‌క‌త్వంలో భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమా ఎప్పుడు..?
భ‌క్త క‌న్న‌ప్ప సినిమాకి క‌థ ఇస్తున్నాను. ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయ‌డం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.