తెలంగాణలోని అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత

  • IndiaGlitz, [Friday,April 05 2024]

తెలుగు రాష్ట్రాల్లో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవినీతిపరులందరూ ఆ పార్టీలోనే ఉంటారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి వారికే పెద్ద పీట వేస్తారు. తాజాగా మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఐడీలో సైబర్‌‌క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఆయన 2019లో టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని బుద్వేల్‌లో అసైన్డ్‌ భూములను శివానందరెడ్డి కాజేసినట్టు తెలంగాణ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై ఈనెల 2న కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బుద్వేల్ ప్రాంతంలో కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి అసైన్డ్ ల్యాండ్‌లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు. అయితే వాటిని దక్కించుకునేందుకు శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్‌.దశరథ రామారావులను రంగంలోకి నడిపారు.

ఆ తర్వాత అసైన్డ్ పట్టాదారులకు నామమాత్రం రుసుం చెల్లించి 26 ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు రాత్రికి రాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మెమో ద్వారా అసైన్డు భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తేలింది. దీంతో సీసీఎస్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించేందుకు నంద్యాల జిల్లా అల్లూరు గ్రామానికి వెళ్లారు. కానీ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. మొత్తానికి పక్క రాష్ట్రం అసైన్డ్ భూములు కాజేసిన టీడీపీ నేత తీరుపై స్థానిక ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

More News

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలే హస్తం పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

Chandrababu: చంద్రబాబుకు భారీ షాక్.. ఎన్నికల సంఘం నోటీసులు..

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి.

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

ఇదేం విడ్డూరం అయ్యా.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా..

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రమాదాలు నివారించండి అని పోలీసులు తరుచూ చెబుతూ ఉంటారు. ఇదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝూళిపిస్తుంటారు.