సోదరిగానైనా గౌరవించాలిగా .. ఎన్నోసార్లు అవమానించారు: కేసీఆర్ సర్కార్‌పై తమిళిసై ఆరోపణలు

  • IndiaGlitz, [Thursday,April 07 2022]

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ వెళ్లకపోవడం, మేడారం తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ పాటించకపోవడం వంటి సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉగాది నాడు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో తమిళిసై సౌందరరాజన్ ఓపెన్ అయ్యారు.

తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ని అని .. తనకు ఇగో లేదంటూ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదంటూ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, ఇతర బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. దీంతో తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా రాజకీయాలు మారాయి. బీజేపీ - టీఆర్ఎస్ నేతల మాటల దాడితో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.

ఈ క్రమంలో తమిళిసై మాట్లాడుతూ తనకు గౌరవం ఇవ్వటం లేదన్నది వాస్తవమని అంగీకరించారు. తాను ఎవ్వరిని కించపరచటం లేదని.. నేను ఈ విషయాలను ప్రజల ముందు పెడుతున్నానని చెప్పారు. కనీసం సోదరిగా నైనా గౌరవం ఇవ్వాలన్న తమిళిసై.. తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ డోర్స్ ఎపుడూ తెరిచే ఉంటాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడయినా రావచ్చని స్పష్టం చేశారు. తనతో ఉన్న సమస్యపై చర్చించాలని.. సమ్మక్క సారక్క ప్రోగ్రాంకు వెళ్తే ఏం జరిగిందో, ఎమ్మెల్యే సితక్క మీడియాకు చెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యానని.. అన్ని అంశాలపై చర్చించానని తమిళిసై వెల్లడించారు. ఈ నెల 11 న భద్రాచలం వెళ్తున్నానని.. రోడ్డు మార్గాన మాత్రమే ప్రయాణిస్తానని గవర్నర్ పేర్కొన్నారు.

More News

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌పై డామినేషన్… మీడియాకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన చరణ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.

పవన్ బాడీ మామూలుగా లేదుగా.. ‘‘హరిహర’’ కోసం కంప్లీట్ మేకోవర్, ఫోటోలు వైరల్

కథ తన మనసుకి నచ్చితే.. ప్రజలకు వినోదం అందిస్తుందని నమ్మితే అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

అభయ్‌కి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు..హీరో కునాల్‌ కెమ్ము

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు,

డిజిటల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘అర్ధం’లోని ‘‘యాలో ఈ గుబులే ఏలో..’’ సాంగ్‌

రిత్విక్‌ వెట్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్‌ పతాకంపై శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌,అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ, సాయి ధీన, నందిత దురై రాజ్‌,

భారత్‌లో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’... ముంబైలో తొలి కేసు, కేంద్రం అలర్ట్

2019 చివరిలో చైనాలో వెలుగుచూసిన కోవిడ్ మహమ్మారి భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.