close
Choose your channels

పవన్ బాడీ మామూలుగా లేదుగా.. ‘‘హరిహర’’ కోసం కంప్లీట్ మేకోవర్, ఫోటోలు వైరల్

Thursday, April 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కథ తన మనసుకి నచ్చితే.. ప్రజలకు వినోదం అందిస్తుందని నమ్మితే అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ కష్టమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా బాడీ ఫిట్‌గా వుంచడంతో పాటు కాస్ట్యూమ్స్, లుక్ విషయంలో ట్రెండీగా వుంటారు పవర్ స్టార్. ఇప్పటికే ఈ ఏడాది ‘‘భీమ్లా నాయక్’’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టారు. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన కథతో ప్రేక్షకులను అలరించేందుకు డైరెక్టర్ క్రిష్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశారు పవర్ స్టార్. భీమ్లానాయక్ క్యారెక్టర్ నుంచి వీరమల్లుగా పవన్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. భీమ్లాకు వీరమల్లుకు పూర్తిగా తేడాలు కనిపిస్తున్నాయి.

బాడీని ఫిట్‌గా ఉంచేందుకు పవన్ కల్యాణ్ నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరోవైపు హరిహర వీరమల్లులోని యుద్ధ విన్యాసాల కోసం ఫ్లైక్సిబుల్ బాడీ కోసం శ్రమిస్తున్నారు పవర్ స్టార్. ఈ పవర్ ఫుల్ రిహార్సల్స్ కు సంబంధించిన ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. వాటిల్లో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జిటిక్ గా, ఫిట్ గా కనిపిస్తున్నారు. అలాగే బళ్లెం, కర్రసాములపైనా పవన్ కసరత్తు చేస్తున్నారు.

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏ దయాకర్ రావు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ను తెరక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందని సమాచారం. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.