టీఎస్‌పీఎస్‌సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,April 29 2021]

తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగి జె.శంకర్ వేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్‌సీ‌లో ఎలాంటి సభ్యులు లేరని పిటిషనర్ పేర్కొన్నారు. పబ్లిక్ కమిషన్‌లో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ కమిషన్‌ను క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. తెలంగాణ పబ్లిక్ కమిషన్ చాలా ముఖ్యమైనదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చైర్మన్, సభ్యులను నియమించకపోతే.. టీఎస్‌పీఎస్‌సీ మూసివేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. చైర్మన్, సభ్యులను నియమించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కమిషన్ సభ్యుల నియామకాలు చేపడుతామని హైకోర్టుకు ఏజీ వెల్లడించారు.పిల్ పై విచారణను హైకోర్టు జూన్ 17కి వాయిదా వేసింది.

మరోవైపు తెలంగాణలో 30న కర్ఫ్యూ ముగియనుండటంతో అనంతరం తీసుకోబోయే చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. అటు కర్ఫ్యూ అనంతరం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నిస్తునే.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.. తదుపరి చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు ఆపరా? అంటూ ఈసీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఎన్నికలా? అని నిలదీసింది. ఇటు కర్ఫ్యూ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చివరి నిమిషం వరకూ ఆలోచించేది లేదా? అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

More News

కూకట్‌పల్లి ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు..

ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది.

సాయం అందించాలని సోనూసూద్ పిలుపునకు విశేష స్పందన

లాక్‌డౌన్ మొదలు చేతికి ఎముక లేదన్నట్టుగా కష్టాల్లో ఉన్న జనానికి సాయం అందిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ప్రస్తుతం సాయం కోసం అర్థిస్తున్నారు.

అటు కేసీఆర్ సర్కార్.. ఇటు ఈసీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

షాకింగ్ విషయం చెప్పిన హరితేజ.. డెలివరీకి సరిగ్గా వారం ముందు..

‘బిగ్‌బాస్’ ఫేం, నటి హరితేజ ఓ షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

‘నారప్ప’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన వెంకీ

కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’, ‘విరాటపర్వం’, ‘లవ్ స్టోరీ’ తదితర చిత్రాలు