'బ్రూస్ లీ'లోనూ ఆ సీన్ ఉంటుందా?

  • IndiaGlitz, [Monday,October 12 2015]

శ్రీ‌నువైట్ల సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. అయితే 'ఆనందం' నుంచి వైట్ల సినిమాల్లో వినోదం కోసం ఏ సీన్‌లు రిపీట్ చేసినా.. చేయ‌క‌పోయినా ఓ సీన్ మాత్రం కంప‌ల్స‌రీ. అదే తాగుడు సీన్‌. ఇది లేకుండా వైట్ల సినిమాని ఊహించుకోవ‌డం క‌ష్టం. ఈ నేప‌థ్యంలో త‌న లేటెస్ట్ మూవీ 'బ్రూస్‌లీ'లోనూ ఈ సీన్ త‌ప్పకుండా ఉండే ఉంటుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'అంద‌రి వాడు' చిత్రాన్ని రూపొందించిన వైట్ల‌.. అందులో తండ్రి పాత్ర‌లోనూ సంద‌డి చేసిన చిరు పాత్ర‌ని కేవ‌లం ఓ సీన్‌కే కాకుండా మాగ్జిమ‌మ్ సీన్స్ కి తాగుడు కోసం వాడుకుని వినోదాన్ని అందించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నీ 'బ్రూస్‌లీ' కోసం అలాంటి స‌న్నివేశంలో చూపుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

'పటాస్' డైరెక్టర్ ఫార్ములా మిస్ కావడం లేదు

2015లో తొలి ఘన విజయంగా 'పటాస్' మూవీ క్రెడిట్ దక్కించుకుంది. కళ్యాణ్ రామ్ కి రాంగ్ టైమ్ నడుస్తున్న టైంలో రైట్ రిజల్ట్ ఇచ్చిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడు.

నయనతార.. మూడోనెల

కోలీవుడ్లో నయన తార పేరు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అక్కడి సినిమాలతోనూ.. లేదంటే అక్కడి సెలబ్రిటీలతో లవ్ ఎఫైర్స్, ఫెయిల్యూర్స్.. ఇలా ఆమె ఏం చేసినా సెన్సేషన్. ఈ మధ్య మాత్రం మిగతా వ్యవహారాల కంటే సినిమాల పరంగానే నయన పేరు తరుచుగా అక్కడ నానుతోంది.

నిహారిక ఎంట్రీ పై చరణ్ కామెంట్..?

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.

బాహుబలి 2 పక్కన పెట్టిన రానా..?

బాహుబలి సినిమాలో తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రానా.అందరు బాహుబలి 2ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తుంటే...

ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' ఆడియో విడుదల

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది.