close
Choose your channels

'బ్రూస్ లీ'లోనూ ఆ సీన్ ఉంటుందా?

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ‌నువైట్ల సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. అయితే 'ఆనందం' నుంచి వైట్ల సినిమాల్లో వినోదం కోసం ఏ సీన్‌లు రిపీట్ చేసినా.. చేయ‌క‌పోయినా ఓ సీన్ మాత్రం కంప‌ల్స‌రీ. అదే తాగుడు సీన్‌. ఇది లేకుండా వైట్ల సినిమాని ఊహించుకోవ‌డం క‌ష్టం. ఈ నేప‌థ్యంలో త‌న లేటెస్ట్ మూవీ 'బ్రూస్‌లీ'లోనూ ఈ సీన్ త‌ప్పకుండా ఉండే ఉంటుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'అంద‌రి వాడు' చిత్రాన్ని రూపొందించిన వైట్ల‌.. అందులో తండ్రి పాత్ర‌లోనూ సంద‌డి చేసిన చిరు పాత్ర‌ని కేవ‌లం ఓ సీన్‌కే కాకుండా మాగ్జిమ‌మ్ సీన్స్ కి తాగుడు కోసం వాడుకుని వినోదాన్ని అందించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నీ 'బ్రూస్‌లీ' కోసం అలాంటి స‌న్నివేశంలో చూపుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.