'ప్రేమమ్' పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్

  • IndiaGlitz, [Wednesday,September 28 2016]

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య శృతిహాసన్ ,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 7న సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.

మలయాళంలో ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్ వంటి చిత్రాలతో పాటు తెలుగులో భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ మ్యూజిక్ తో పాటు రాజేష్ మురుగన్ అందించిన పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అక్కినేని జయంతి సెప్టెంబర్ 20న విడుదల చేశారు. ఈ పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ చానెల్ లో ఈ సినిమా పాటలను మూడు మిలియన్ ప్రేక్షకులు వినడం విశేషం. ప్రేమకథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ అంటే పెట్టింది పేరు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రేమాభిషేకం, కింగ్ నాగార్జున మజ్ను, గీతాంజలి వంటి చిత్రాల స్థాయిలో ఈ సినిమా ఉంటుందని కింగ్ నాగార్జున సెలవియడం గమనార్హం. అంతే కాకుండా ఏ మాయ చేసావే తర్వాత నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ లవ్ స్టోరీగా నిలవనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

More News

'ఈడు గోల్డ్ ఎహే' సెన్సార్ పూర్తి

డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది.

నవీన్ డేడికేషన్ చూసి షాకయ్యాను..అతని హార్డ్ వర్కే సక్సెస్ అందిస్తుంది - మహేష్ బాబు

ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మనవడు నవీన్ హీరోగా గిరి తెరకెక్కించిన చిత్రం నందిని నర్సింగ్ హోమ్.ఈ టైటిల్ కి ఇక్కడ అంతా క్షేమము అనేది ట్యాగ్ లైన్.

ప్రేమమ్ చూసి నాగ్ ఏమన్నారో తెలుసా..!

అక్కినేని నాగచైతన్య నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్.

రానాకు వెంకటేష్ వాయిస్ ఓవర్...

దగ్గబాటి రానా హీరోగా తాప్సీ హీరోయిన్ గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ఘాజి. .

రవితేజ మూవీకి ముహుర్తం ఖరారు..!

మాస్ రాజా రవితేజ-సర్ధార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.