close
Choose your channels

'ప్రేమమ్' పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్

Wednesday, September 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య శృతిహాసన్ ,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్` పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 7న సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.

మలయాళంలో ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్ వంటి చిత్రాలతో పాటు తెలుగులో భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ మ్యూజిక్ తో పాటు రాజేష్ మురుగన్ అందించిన పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అక్కినేని జయంతి సెప్టెంబర్ 20న విడుదల చేశారు. ఈ పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ చానెల్ లో ఈ సినిమా పాటలను మూడు మిలియన్ ప్రేక్షకులు వినడం విశేషం. ప్రేమకథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ అంటే పెట్టింది పేరు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రేమాభిషేకం, కింగ్ నాగార్జున మజ్ను, గీతాంజలి వంటి చిత్రాల స్థాయిలో ఈ సినిమా ఉంటుందని కింగ్ నాగార్జున సెలవియడం గమనార్హం. అంతే కాకుండా ఏ మాయ చేసావే తర్వాత నాగచైతన్య కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ లవ్ స్టోరీగా నిలవనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.