దేశ వ్యాప్తంగా ఆగస్ట్‌లో తెరుచుకోనున్న థియేటర్లు!

  • IndiaGlitz, [Wednesday,July 29 2020]

లాక్‌డౌన్ సమయంలో మూతపడ్డ సినిమా హాళ్లు ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో కొన్ని జాగ్రత్తల నడుమ హాళ్లు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో హాళ్లు ఇప్పట్లో తెరుచుకుంటాయా? లేదా? అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కొందరు సినీ ప్రముఖులతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు. 25 శాతం ఆక్యుపెన్సీతో ఆగస్ట్ 1 నుంచి సినిమా హాళ్లు తెరవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అంగీకారం తెలిపాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఈ నెల 31న తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అయితే రాష్ట్రాల అనుమతితో షూటింగ్‌లను మాత్రం చేసుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని నిర్మాత సురేష్ బాబుకు చెప్పానన్నారు. దక్షిణాది ఛాంబర్, అసోసియేషన్ నుంచి లేఖలు రాశామని సురేష్ చెప్పారని.. కేంద్ర హోంశాఖకు కూడా లేఖలు ఇస్తే ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం వచ్చే సినీ పరిశ్రమపై సానుకూల నిర్ణయం ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కిషన్‌రెడ్డి హామీతో ఆగస్ట్ బొమ్మ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More News

జీవితాన్నే కథగా చెబుతున్న ‘జోహార్’

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు.

అప్పుడు 16-17 గంటలు రోడ్లపైనే గడిపాను: సోనూసూద్

లాక్‌డౌన్ అనగానే ఎవరికి వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ కూడా బయటకు రాలేదు. ఆ సమయంలో వలస కార్మికుల తిప్పలు వర్ణనాతీతం.

రావి కొండలరావు గారి బహుముఖ సేవలు అజరామరం: పవన్

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

‘జోహార్’ టీజర్ విడుద‌ల చేసిన మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు.

సోనూసూద్ గురించి కోన వెంకట్ చెప్పిన విషయాలు వింటే షాకవుతారు..

ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రముఖ దర్శకుడు, రచయిత కోనా వెంకట్ పలు ఆసక్తికర విషయాలు..