మా మ‌ధ్య అలాంటిదేమీ లేదంటున్న హ‌న్సిక‌

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

దేశముదురు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఆత‌ర్వాత కంత్రి, మ‌స్కా, దేనికైనా రెడీ..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. చంద్ర‌క‌ళ సినిమాతో భ‌య‌పెట్టిన హ‌న్సిక క‌ళావ‌తి సినిమాతో మ‌రోసారి భ‌య‌పెట్ట‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈనెల 29న క‌ళావ‌తి సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...క‌ళావ‌తి సినిమాలో హ‌న్సిక తో పాటు నిషా క‌ళ్ల త్రిష కూడా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో హ‌న్సిక‌, త్రిష మ‌ధ్య వార్ జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇదే విష‌యం గురించి హ‌న్సిక ని అడిగితే...ఈ సినిమాకి ముందు నుంచి త్రిష తెలుసు. త్రిష కు నాకు మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయ‌న్న వార్త‌లు గురించి విన్నాను. తెలిసిన వెంట‌నే త్రిష కి ఫోన్ చేసి..మాట్లాడి ఇద్ద‌రం న‌వ్వేసుకున్నాం. మా మ‌థ్య అలాంటిదేమీ లేద‌ని త్రిషే మీడియాకు చెప్పింది. మేమిద్ద‌రం మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా చెబుతున్నాను మా మ‌ధ్య అలాంటిదేమీ లేదు అంటుంది హ‌న్సిక. అదీ సంగ‌తి.

More News

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో..ఎవ‌రో కాదు ఎన‌ర్జిటిక్ హీరో రామ్. ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న రిలీజైన నేను..శైల‌జ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యాన్ని సాధించింది.

సూప‌ర్ క‌లెక్షన్స్ తో దూసుకెళుతున్న‌ సోగ్గాడు

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతి కానుక‌గా 450 ధియేట‌ర్స్ లో రిలీజ్ అయ్యింది.

కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాను రీమేక్ చేస్తానంటున్నస‌చిన్‌

మౌన‌మేల‌నోయి, నీ జ‌త‌గా నేనుండాలి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచితుడైన స‌చిన్ జోషి త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మారి బాలీవుడ్లో సినిమాను నిర్మంచబోతున్నాడ‌ట‌.

న‌యన‌తార రెండోసారి...

వెంక‌టేష్‌, న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి చేస్తున్న సినిమా బాబూ..బంగారం. లక్ష్మీ, తుల‌సి చిత్రాల్లో వెంక‌టేష్‌తో జోడి క‌ట్టిన న‌య‌న‌తార మూడోసారి మాత్రం న‌య‌న‌తార స‌ర‌స‌న న‌టించ‌డం లేద‌ట‌.

ప‌వ‌ర్ స్టార్ వెర్షెస్ స్టైలీష్ స్టార్..

సంక్రాంతికి నంద‌మూరి హీరోలు బాల‌కృష్ణ డిక్టేట‌ర్ - ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాలు ఒక‌రోజు గ్యాప్ లో పోటీప‌డిన విష‌యం తెలిసిందే.