విష్ణుతో ముచ్చటగా మూడోసారి....

  • IndiaGlitz, [Monday,August 22 2016]

మంచు విష్ణు కామెడి ఎంట‌ర్ టైన‌ర్స్ నే చేయాల‌నుకుంటున్నాడట. అందుక‌నే త‌ను వింటున్న క‌థ‌ల్లో కామెడి ఉండాల‌ని చెబుతున్నాడ‌ని స‌మాచారం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత మ‌రే విష్ణు గీతాంజ‌లి, త్రిపుర చిత్రాల ఫేమ్ రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌లో న‌టించ‌నున్నాడు.

ఈ చిత్రానికి ల‌క్కున్నోడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ చిత్రంలో మంచు విష్ణు స‌ర‌స‌న బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. పాండ‌వులు పాండవులు తుమ్మెద‌, దేనికైనా రెడీ సినిమాలు త‌ర్వాత మూడోసారి హ‌న్సిక విష్ణుతో జ‌తక‌డుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి....తెలుగు సినీ ప్రేక్షకాభిమానులకు పెద్దగా పరిచయంఅక్కర్లేని పేరు. తెలుగు స్టామినాను విదేశాలకు చాటడమే కాకుండా మాస్‌ ఇమేజ్‌కు కొత్త అర్తాన్ని చెప్పిన కథానాయకుడుగా కూడా చిరంజీవి తనదైన గీటురాయిని ఏర్పరిచాడు.

'చుట్టాలబ్బాయి' సినిమాకు చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది - వెంకట్ తలారి

ఆది హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్,ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై వెంకట్ తలారి,రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం.'చుట్టాలబ్బాయి'.

ఆగస్టు 26న 100 డేస్ ఆఫ్ లవ్

ఎవర్ గ్రీన్ పెయిర్ దుల్కర్ సల్మాన్,నిత్యమీనన్ జంటగా రానున్న 100డేస్ ఆఫ్ లవ్ సినిమా విడుదలకు సిద్ధమైంది.ఇప్పటికే ఆడియో విడుదల చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు.

మెగాస్టార్ పుట్టిన‌రోజు ఉత్స‌వాల్ని ఘ‌నంగా జ‌రిపించిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు - మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

ఆగ‌స్టు 22(నేడు)న‌ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మెగా ఫ్యాన్స్  9 రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు దేవాల‌యాల్లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

రీమేక్ లో అమల

తమిళంలో ధనుష్, అమలాపాల్ నటించిన వి.ఐ.పి సినిమా చాలా పెద్ద సక్సెస్ ను సాధిచింది. తెలుగులో కూడా రఘువరన్ బి.టెక్ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.