'తొలి ప్రేమ' ఆడియో రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Wednesday,January 17 2018]

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా పాట‌ల‌ను జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - "కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం 'తొలి ప్రేమ‌'. హృద‌యానికి హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌. వ‌రుణ్ తేజ్ కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, నిన్నిలా నిన్నిలా చూశానే...అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్‌ను జ‌న‌వ‌రి 20న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం. అలాగే ఫిబ్ర‌వరి 9న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

వ‌రుణ్ తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి.విలియ‌మ్స్‌.

More News

ర‌వి చావ‌లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'సూప‌ర్ స్కెచ్‌'

"మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే థ్రిల్ల‌ర్‌గా మా `సూప‌ర్ స్కెచ్‌`ను రూపొందించాం. పూర్తిగా స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది" అని ద‌ర్శ‌కుడు ర‌వి చావ‌లి అన్నారు. 'సామాన్యుడు', 'శ్రీమ‌న్నారాయ‌ణ‌' తదితర చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న రవి చావలి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం 'సూప‌ర్ స్కెచ్

మరణంలేని జననం - అలుపెరగని గమనం - అంతేలేని పయనం ఆయనిది: వై వి ఎస్ చౌదరి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న' మరియు అభిమానుల పాలిట దైవం.. స్వర్గీయ 'నందమూరి తారక రామారావు' గారి దివ్యమోహన రూపం సినిమాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నిచ్చిందీ, తిరిగి ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన సంచలన మరియూ సంక్షేమ పధకĹ

స్పోర్ట్స్ మూవీలో బెల్లంకొండ‌...

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్ మూవీస్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతూ ఆ దిశ‌గా మంచి  క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. ప్ర‌స్తుతం  శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు.

స‌క్సెస్ కొట్టిన ల‌వ‌ర్స్‌

కోలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా రాణిస్తున్న కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌.. తెలుగులోనూ ఆడ‌పాద‌డపా సినిమాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌తో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం (బాబు బంగారం) చేసిన న‌య‌న్‌.. తాజాగా మ‌రో సీనియ‌ర్ క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌తో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం  'జై సింహా' చేసింది.

భారీ మొత్తానికి 'భ‌ర‌త్ అనే నేను' ఆడియో రైట్స్‌?

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న కాంబినేష‌న్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న నాలుగో చిత్రం భ‌ర‌త్ అనే నేను.