close
Choose your channels

భారీ మొత్తానికి 'భ‌ర‌త్ అనే నేను' ఆడియో రైట్స్‌?

Tuesday, January 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న కాంబినేష‌న్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న నాలుగో చిత్రం భ‌ర‌త్ అనే నేను. మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌గా.. సినిమా ఏప్రిల్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ మొత్తానికి ప‌లికాయంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ ఈ సినిమా ఆడియో రైట్స్‌ని రూ.2 కోట్లు (జి.ఎస్‌.టి అద‌నం) వ‌ర‌కు కొనుగోలు చేసింద‌ని స‌మాచార‌మ్‌. అలాగే రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న రంగ‌స్థ‌లం ఆడియో రైట్స్ కూడా రూ.1.6 కోట్ల‌కు కోనుగోలు అయ్యాయ‌ని తెలుస్తోంది.

ఈ సినిమా కూడా వేస‌వి కానుక‌గా మార్చి 30న విడుద‌ల కానుంది. ఈ రెండు చిత్రాల ఆడియోకి ఉన్న డిమాండ్ చూస్తుంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌కి ఎంత‌గా క్రేజ్ ఉందో అర్థ‌మ‌వుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.