ద్వితీయార్థంలో మూడు సినిమాల‌తో సంద‌డి..

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన హీరో ధ‌నుష్ .. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ది ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద ఫ‌కీర్‌' చిత్రంతో హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ద్వితీయార్థంలో ఏకంగా.. మూడు సినిమాలతో సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ నెల 17న వెట్రి మార‌న్ డైరెక్ష‌న్‌లో చేసిన వ‌డ చెన్నై విడుద‌ల‌వుతుంది.

ఇక నవంబ‌ర్ 2న గౌత‌మ్ మీన‌న్‌తో చేసిన ఎన్నై నోక్కి పాయుం తూట్టా సినిమా విడుద‌ల‌వుతుంది. ఇక మారి సీక్వెల్‌గా తెర‌కెక్కిన మారి 2 డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ మూడు చిత్రాలపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మూడు చిత్రాల్లో ఎన్ని స‌క్సెస్‌ల‌ను అందుకోనున్నాడో ధ‌నుష్‌.